Top Headlines: ప్రకాశం జిల్లాలో మూడోసారి ప్రకంపనలు - అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In AP And Telangana:
1. ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు
ప్రకాశం జిల్లాలో పలుచోట్ల మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. వరుసగా మూడోరోజు భూమి కంపించడంతో ప్రజలు ప్రాణభయంలో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లాలోని సింగనపాలెం, ముండ్లమూరు, శంకరాపురం, మారెళ్ల పరిసర ప్రాంతాల్లో సోమవారం నాడు భూ ప్రకంపనలు వచ్చాయి. శనివారం, ఆదివారం సైతం ఈ ప్రాంతాల్లో భూమి కంపించింది. ప్రకాశం జిల్లాలో శనివారం, ఆదివారం సైతం భూమి కంపించింది. వరుసగా మూడు రోజులు భూమి కంపించడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఆదివారం ముండ్లమూరు మండలంలో భూమి కంపించింది. ఇంకా చదవండి.
2. కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యే విషయాల్లో కడప మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి. ఇటీవల ప్రొటోకాల్ పాటించడం లేదని టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి (Madhavi Reddy) ప్రశ్నించడంతో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. సోమవారం సైతం మహిళా ఎమ్మెల్యే మాధవీరెడ్డికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాధవీరెడ్డికి వేదికపై కుర్చీ వేయలేదు. ఈ విషయంపై మేయర్‌ను ఆమె గట్టిగా నిలదీయడంతో కార్పొరేషన్ సమావేశం మరోసారి రసాభాసగా మారింది. తనకు కూర్చీ వేసేంతవరకు నిల్చునే ఉంటానంటూ ఎమ్మెల్యే మాధవీరెడ్డి కడప మేయర్ (Kadapa Mayor) పోడియం వద్ద నిరసన తెలిపారు. ఇంకా చదవండి.
3. మాజీ మంత్రి పేర్ని నానికి తప్పని తిప్పలు
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. పేర్ని నాని కుటుంబానికి సంబంధించిన గోదాముల్లో క్వింటాళ్ల కొద్దీ బియ్యం మాయం కావడంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసులో ఇంకా దాగుడుమూతలు కొనసాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. డిసెంబర్ 10న పేర్ని నాని భార్య పేర్ని జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరసరఫరాలశాఖ అధికారి ఫిర్యాదు మేరకు పేర్ని జయసుధతో పాటు గోదాముల మేనేజర్ మానస తేజపై కేసు నమోదు చేయగా.. ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ నెల 24కి వాయిదా పడింది. ఇంకా చదవండి.
4. బన్నీ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం
టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ ఇంటిపై టమోటాలు విసిరి, పూలకుండీలు ధ్వంసం చేసి ఆందోళనకు దిగిన కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఓయూ జేఏసీ నేతలు (OU JAC Leaders)ను వనస్థలిపురంలోని న్యాయమూర్తి నివాసంలో జూబ్లీహిల్స్ పోలీసులు హాజరు పరిచారు. ఇంకా చదవండి.
5. తెలంగాణ విద్యార్థులకు అలర్ట్
తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో (TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS,TGREIS) 2025-26 విద్యాసంవత్సరానికిగాను 5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం)లో ప్రవేశాలకు గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ వెలువడింది. ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 21న ప్రారంభమైంది. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశాలు పొందడానికి అర్హులు. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 1 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంకా చదవండి.