అన్వేషించండి

TGCET 5th Class Admission: తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్, ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?

Telangana Gurukulam: తెలంగాణ గురుకులాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష కోసం గురుకుల విద్యాలయాల సంస్థ దరఖాస్తులు కోరుతోంది..

TGSWREIS Gurukula 5th Class Admissions 2025: తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో (TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS,TGREIS) 2025-26 విద్యాసంవత్సరానికిగాను 5వ తరగతి(ఇంగ్లిష్‌ మీడియం)లో ప్రవేశాలకు గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ వెలువడింది. ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 21న ప్రారంభమైంది. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశాలు పొందడానికి అర్హులు. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 1 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. 

దరఖాస్తు చేసుకున్నవారికి ఫిబ్రవరి 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంపికచేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభ, రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాలు పొందినవారికి రెగ్యులర్ చదువుతోపాటు ఐఐటీ, ఎన్‌ఐటీ, నీట్, ఎప్‌సెట్ లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తారు. విద్యార్థులకు పుస్తకాలు, ఇతర స్టేషనరీ వస్తువులు ఉచితంగా ఇస్తారు. ఉచిత వసతి, ఆరోగ్యకరమైన భోజన సదుపాయాలు ఉంటాయి. వీటితోపాటు స్కూల్ యూనిఫామ్, షూతోపాటు విద్యార్థికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తారు. 

విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్ లైన్ నంబర్: 1800 425 45678, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌: 040- 23391598, టీజీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌: 9491063511, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌: 040-23328266, టీజీఆర్‌ఈఐఎస్‌: 040- 24734899 నెంబర్లలో సంప్రదించవచ్చు.

వివరాలు..

* తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు 

అర్హత: సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో 2024-25 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదివి ఉండాలి. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. 

వయోపరిమితి: ఓసీ, బీసీ, బీసీ విద్యార్థులు 9 నుంచి 11 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 సంవత్సరాల మధ్య ఉండాలి. 
ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతం రూ.1.50,000; పట్టణ ప్రాంతం రూ.2,00,000 మించకూడదు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.100. 

ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ప్రవేశ పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులు ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో తెలుగు-20 మార్కులు, ఇంగ్లిష్-25 మార్కులు, మ్యాథమెటిక్స్-25 మార్కులు, మెంటల్‌ ఎబిలిటీ-10 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-20 మార్కులు ఉంటాయి. 4వ తరగతి స్థాయిలోనే ప్రశ్నలు అడుగుతారు. 

పరీక్ష కేంద్రాలు: అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు... 

✪ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 21.12.2024.

✪ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.02.2025. 

✪ ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 23న.

✪ పరీక్ష సమయం: ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు. 

Notifcation

Payment Link

Application Link

Website

ALSO READ: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Embed widget