Today Top Headlines: కర్ణాటక ప్రమాదంలో విద్యార్థుల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి - హనుమకొండలో పట్టపగలే దారుణం, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:
1. కర్ణాటక ప్రమాదంలో విద్యార్థుల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు వేదశాల విద్యార్థులు, ఓ డ్రైవర్ మృతిచెందారు. ఈ ప్రమాదంలో దావోస్ లో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు. విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేద పాఠశాల ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన వార్త తీవ్ర ఆవేదనను కలిగించింది. హంపికి వెళ్తూ పొరుగు రాష్ట్రంలో వారి వాహనం ప్రమాదానికి గురైంది. బాధితులకు అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను అదేశించారు. ఇంకా చదవండి.
2. సీఎం చంద్రబాబుకు నారా భువనేశ్వరి షాక్
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించనున్నారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15న ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ నిర్వహించనున్నామని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు (Chandrababu) హాజరవుతారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కూడా ఆహ్వానిస్తామని ఆమె తెలిపారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఈ కార్యక్రమం గురించి నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకా చదవండి.
3. హనుమకొండలో పట్టపగలే దారుణం
హనుమకొండలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు ఆటోడ్రైవర్ల మధ్య తలెత్తిన వివాదం కత్తి దాడికి దారితీసింది. ఈ క్రమంలో కత్తిపోట్లకు గురై తీవ్ర రక్తస్రావంతో ఓ ఆటో డ్రైవర్ నడిరోడ్డుపైనే దారుణహత్యకు గురయ్యాడు. హనుమకొండ పోలిస్ డివిజన్ సుబేదారి పీఎస్ పరిధిలో ఉన్న డీమార్ట్ ఎదురుగా ఘటన జరిగింది. ఆటో స్టాండ్ పక్కన ఇద్దరు ఆటో డ్రైవర్లు గొడవ పడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఇంకా చదవండి.
4. హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్
తెలంగాణ ప్రభుత్వం దావోస్‌లో పెట్టుబడుల వేట కొనసాగిస్తోంది. ఇదివరకే యూనిలీవర్, హెచ్‌సీఎల్ లాంటి దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. తాజాగా హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కంట్రోల్ ఎస్ (CtrlS) ముందుకొచ్చింది. ప్రపంచ ఆర్థిక సదస్సు (World Economin Forum)లో భాగంగా రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కంట్రోల్ ఎస్ సంస్థ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇంకా చదవండి.
5. కాంగ్రెస్‌పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడ్దారు. కాంగ్రెస్ పాలనలో దివ్యంగుడైన ఒక మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుండగులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. బీఆర్ఎస్ కు భయపడి నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వలేదని.. ఫ్లెక్సీలు చింపి, ఏకంగా ఓ ప్రభుత్వ ఆఫీసులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండాలు దివ్యాంగుడైన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని బూతులు తిడుతూ పోలీసుల ముందే దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఇంకా చదవండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

