Karnataka Road Accident: కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ఏపీ విద్యార్థుల మృతిపై చంద్రబాబు, లోకేష్ దిగ్భ్రాంతి
Mantralayam Vedic School Students Death | కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన విద్యార్థుల మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Chandrababu expresses shock over death of Vedic school students | కర్నూలు: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు వేదశాల విద్యార్థులు, ఓ డ్రైవర్ మృతిచెందారు. ఈ ప్రమాదంలో దావోస్ లో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు. విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేద పాఠశాల ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన వార్త తీవ్ర ఆవేదనను కలిగించింది. హంపికి వెళ్తూ పొరుగు రాష్ట్రంలో వారి వాహనం ప్రమాదానికి గురైంది. బాధితులకు అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను అదేశించారు. వేద విద్యార్థుల అకాల మరణంతో వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా కూటమి ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం అని భరోసా ఇచ్చారు.
కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు, డ్రైవర్ మృతి చెందడంతో ఏపీ విద్య, ఐటీశాఖల మంత్రి నారా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కర్ణాటకలోని హంపి పర్యటనకు వెళ్తున్న వారి వాహనం సింధనూరు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై వేద పాఠశాల విద్యార్థులు మరణించడం బాధాకరం అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆయన ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానభూతి తెలిపారు.






















