World Yoga Day Special Story | 6 ఏళ్ల వయస్సులోనే యోగా..అంతర్జాతీయ పతకాలతో రికార్డులు సృష్టిస్తున్న తెలుగుబాలుడు | ABP Desam
ఈ బాలుడు చేసే యోగాసనాలు చూడండి. స్ప్రింగ్ లా శరీరాన్ని ఎలా మడతపెట్టేస్తున్నాడో..
ఎంతో కష్టమైన హ్యాండ్ బ్యాలెన్స్ ఆసనాలు సైతం చిటికెలో వేస్తున్నాడు. ఇంతలా యోగాసనాలతో కట్టిపేస్తున్న ఈ బాలధీరుడి పేరు ధీరజ్. తెలుగు కీర్తిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన యోగా బాల మాంత్రికుడు ధీరజ్ పై ABP దేశం ప్రత్యేక కథనం..
మూడేళ్ల వయస్సులోనే యోగాపై పుట్టిన ఆశ.. ఆరేళ్ల వయస్సు నుండి అలుపెరుగని యోగా సాధన ధీరజ్ ను ఉన్నత శిఖరాలకు చేర్చింది. తాజాగా సింగపూర్ లో జరిగిన యోగా ఛాంపియన్ షిప్ పోటీలలో ఏకంగా నాలుగు పతకాలు సాధించాడు. ఇరవైకి పైగా ప్రపంచదేశాలు పాల్గొన్న ఈ యోగా పోటీలలో గెలుపొందిన మొదటి తెలుగు బాలుడిగా అరుదైన రికార్డ్ సొంంత చేసుకున్నాడు.
విజయవాడకు చెందిన శశికళ ,నాగరాజు దంపతులకు జన్మించిన ధీరజ్ కు అతిచిన్న వయస్సు నుండి క్రీడలు, సాస్కృతి పోటీలతోపాటు యోగాపై మక్కువ ఎక్కువ. ఇంట్లో తల్లిదండ్రులు సైతం యోగాను నిత్య జీవన విధానంగా మార్చుకోవడం ధీరజ్ ను మరింతగా యోగాకు దగ్గర చేసింది. ఆరు సంవత్సరాల అతి చిన్న వయస్సు నుండి యోగాసనాలు వేస్తూ అందరని అబ్బురపరుస్తున్న ధీరజ్.. ఇప్పటి వరకూ జిల్లా, రాష్ట్ర , జాతీయ , అంతర్జాతీయ స్దాయిలో 34 పతకాలను సాధించి యోగసాధనతో దూసుకుపోతున్నాడు ఈ బాల యోగాగురు..



















