Harish Rao: ఈటల రాజేందర్‌కు మంత్రి హరీష్ రావు మరో సవాల్..
బీజేపీలో చేరిన తరువాత ఈటల రాజేందర్ అబద్దాలు బాగా నేర్చుకున్నారని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తాను ఏ మీటింగ్ కు వెళ్లినా కరెంట్ కట్ చేస్తున్నారని ఈటల రాజేందర్ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇటీవల శంకర్ నందన్ హాలులో మీటింగ్ పెట్టుకుంటే.. ఈటల మైక్ కట్ అయిందని.. అందుకు టీఆర్ఎస్ కారణమని గోబెల్స్ ప్రచారం చేశారు. కానీ ఫంక్షన్ హాలు వాళ్లు కరెంట్ బిల్లు కట్టలేదని విద్యుత్ కట్ చేశారని వెల్లడించారు. బీజేపీ గెలిస్తే ఢిల్లీకి గుళాంగిరీ.. టీఆర్ఎస్ గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు గుళాంగిరీ.. ఏది కావాలో తేల్చుకోవాలని హుజూరాబాద్ లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రెస్ మీట్‌లో వ్యాఖ్యానించారు.





టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

