Munugode Bypoll | ప్రధాన పార్టీల్లో మొదలైన టెన్షన్. ఓటరుపైనే ఆశలు
"మునుగోడు నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. కొత్త డిజైన్ తో కూడిన ఓటర్ ఐడీ ఇచ్చాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేశాం. ఫ్లైయింగ్ స్కాడ్ తో కలిసి మొత్తంగా యాభై టీంలు ఉన్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ చెప్పారు. ఇంకా 3366 పోలింగ్ సిబ్బందిని , 15 బలగాల సిబ్బంది మునుగోడులో వినియోగిస్తున్నాం. ఎక్కువగా డబ్బు పట్టుబడటంతో ఇన్ కం ట్యాక్స్ అధికారులను ఆదేశించాం. 111 బెల్ట్ షాపులను సీజ్ చేశాం. 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం. వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని" రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు.





















