MLC Kavitha In ED Office: రాత్రంతా కవితను ఈడీ ఆఫీసులోనే ఉంచిన అధికారులు
మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాత్రంతా ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. ముందుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఈడీ, ఐటీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి 4 గంటలపాటు కవితను విచారించారు. సాయంత్రం 5:20 గంటలకు ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం కారులో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి తరలించిన ఈడీ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కవితను ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత రాత్రంతా కవితను ఈడీ కార్యాలయంలోనే ఉంచారు. ఇవాళ మధ్యాహ్నం కవితను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఓవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు అధికారులు కస్టడీ కోరనున్నారు. మరోవైపు తన అరెస్టును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేయనున్నారు.





















