Kavitha Suspended From BRS | బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్ | ABP Desam
కన్నకూతురిపైనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలోని కీలక నేతలపై అవినీతి ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి కేటీఆర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ అధికారిక లేఖను విడుదల చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మాజీ మంత్రి హరీశ్ రావు, సంతోష్ రావులు అవినీతి కి పాల్పడ్డారని ఆ మరకలు అధినేత కేసీఆర్ కు అంటిస్తున్నారంటూ కవిత సోమవారం సంచలన వ్యాఖ్యలే చేశారు. ఈ వ్యాఖ్యలు, గత కొంత కాలంగా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా కవిత ప్రవర్తిస్తున్న తీరుపై మండిపడిన బీఆర్ఎస్ అధిష్ఠానం సుదీర్ఘ చర్చల తర్వాత కవితపై కఠిన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఆదేశాల మేరకు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ క్రమశిక్షణా వ్యవహారాల ఇన్ ఛార్జి సోమా భారత్, పార్టీ జనరల్ సెక్రటరీ టీ రవీందర్ రావు పేరుతో బీఆర్ఎస్ అధికారిక లేఖను విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ..నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నందునే సస్పెండ్ చేస్తున్నట్లు లేఖలో బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. మరి ఈ ఘటన తర్వాత కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు..ఆమె రాజకీయ భవిష్యత్తు ఏంటీ అనే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.





















