Heavy Rains in Ameerpet | నీళ్లలో తేలుతూ బారికేడ్ ను ఢీకొట్టిన కార్
హైదరాబాద్ లోని అమీర్పేట్ మెట్రో స్టేషన్ వద్ద వర్షానికి భారీగా నీళ్లు నిలిచిపోయ్యాయి. అమీర్పేట్ మెట్రో స్టేషన్ వద్ద నిన్న రాత్రి కురిసిన వర్షానికి మోకాళ్ళ లోతులో నీళ్లు చేరాయి. అటుగా వెళ్తున్న కార్లు నీటి ప్రవాహంలో తేలుతూ పక్కనే ఉన్న బారికేడ్ లను ఢీ కొట్టాయి. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
మరో రెండు రోజులు వర్షాలు ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు అలర్ట్‌లు ఇస్తూ నేరుగా పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించింది. అవసర అయితే తప్ప ప్రజలకు బయటకు రావద్దని కూడా విజ్ఞప్తి చేశారు. అధికారులు అంతా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పోలీస్, ట్రాఫిక్ విభాగాలు కలిసి పని చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు హైదరాబాద్ 5 ప్రాంతాల్లో రికార్డ్ స్థాయిలో వర్ష పాతం నమోదు అయింది. శేరిలింగంపల్లిలో 13.38 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయింది. గచ్చిబౌలిలో 13.38 సె.మీ నమోదు కాగా సరూర్ నగర్ లో 12 సెంటీ మీటర్లు అత్యధిక వర్షపాతం నమోదు అయింది.





















