Gun Firing in Malakpet | మలక్‌పేట్‌లో కాల్పులు.. ఒకరు మృతి
హైదరాబాద్ లోని మలక్ పేటలో కాల్పులు ఘటన కలకలం రేపుతోంది. మలక్‌పేటలోని శాలివాహననగర్ పార్క్ లో చందు నాయక్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. చందు నాయక్ అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శాలివాహననగర్ పార్కు వద్దకు చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.
చందూనాయక్ అనే వ్యక్తి మంగళవారం ఉదయం శాలివాహననగర్ లోని పార్కుకు మార్నింగ్ వాక్‌కు వెళ్లాడు. వాకింగ్ చేసి వర్కౌట్లు చేయడానికి వెళ్లిన అతనిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. కారం చల్లి నాలుగు రౌండ్స్ కాల్పులు జరిపారు. అతి సమీపం నుంచి కాల్చడంతో బుల్లెట్ గాయాలై.. తీవ్ర రక్తస్రావంతో చందు నాయక్ స్పాట్ లోనే మృతిచెందాడు. మృతుడు చందు నాయక్ CPI రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన వామపక్ష నాయకుడిగా గుర్తించారు.





















