పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!
జగిత్యాల రూరల్ మండలంలో పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ
భేతి తిరుపతి రెడ్డి అనే రైతు ఇంట్లో ఈ ఘటన
జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలింది. భేతి తిరుపతి రెడ్డి అనే రైతు ఇంట్లో ఈ ఘటన జరిగింది. తాను నెల క్రితం టీవీఎస్ కంపెనీకి చెందిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటీ కొనుగోలు చేసినట్లుగా తిరుపతి రెడ్డి తెలిపారు. నవంబర్ 21 ఉదయం తన ఇంటి కాంపౌండ్ లోపల ఎప్పటిలాగానే స్కూటర్ కు చార్జింగ్ పెట్టానని.. ఒక్కసారిగా బైక్ బ్యాటరీ పేలి మంటలు తీవ్రంగా వ్యాపించాయని చెప్పాడు. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా కాలిపోయింది. ఇంటి తలుపులు పాక్షికంగా కాలాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.





















