(Source: ECI/ABP News/ABP Majha)
Chaya Someshwara Temple Mystery | ఛాయా సోమేశ్వర ఆలయం వెనుక మిస్టరీ ఇదేనా..! | ABP Desam
Chaya Someshwara Temple Mystery |
గర్భగుడిలో ఉన్న శివలింగం వెనక స్తంభపు నీడ..! సైన్స్ కు కూడా అందని మిస్టరీగా మారిన ఈ అద్భుతానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. ఛాయా సోమేశ్వర ఆలయం... ! దక్షిణ భారతదేశంలోనే అతి ప్రాచీన దేవాలయాల్లో ఛాయా సోమేశ్వర ఆలయం ఒకటి..! నల్గొండ పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో పానగల్ అనే గ్రామంలో కొలువై ఉంది. ఈ ఆలయాన్ని ఒకనాటి కాకతీయ సామాంతులైన కందూరు చోళులు క్రీస్తు శకం 12 వ శతాబ్ధంలో నిర్మించారు. ఈ ఆలయంలో మూడు గర్భగుడులు ఉంటాయి. పడమర దిక్కన ఉన్న గర్భగుడిలోని శివలింగం వెనుక ప్రతిబింబించే ఛాయ నేటికి అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది.. ఈ ఆలయ శిల్ప కళ కూడా గొప్పగానే ఉంటుంది. ఇక్కడి స్తంభాలపై రామాయణ, మహాభారత ఘట్టాలు చెక్కబడి న్నాయి.12వ శతాబ్దంలో నిర్మించినప్పటికీ.. ఇప్పటికీ ఈ ఆలయ శోభ తగ్గలేదు. ఎన్నో యుద్ధాలు, ప్రకృతి వైపరిత్యాలు తట్టుకుని నిలబడింది. ఐతే.. దేవాలయ పరిసరాలలో కొన్ని కట్టడాలు శిథిలావస్థకు చేరుకోవడంతో 2016లోనే డిపార్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ అధికారులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని మరమ్మతులు చేశారు. హైదరాబాద్ కు సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. కాబట్టి.. టూరిజం శాఖ వారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది.