Chamala Kiran Kumar Reddy about Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్ ఎంపీ సంచలన ఆరోపణలు
ఖమ్మం జిల్లాలో పర్యటించిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. తన ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెడుతున్నారనే భయంతో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డ్, ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేయించడం లేదా? అని ప్రశ్నించారు కేటీఆర్. త్వరలోనే ఆధారాలతో సహా అన్నీ బయటపెడతా అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖమ్మంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ దంటూ విమర్శించారు. సొంత చెల్లి ఫోన్ ట్యాపింగ్ చేసిన కేటీఆర్ ఖమ్మం చౌరాస్తాలో కూర్చుని కమ్మని ముచ్చట్లు చెబుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి.





















