Assembly Sessions on BC reservation Bill | గంగుల కమలాకర్‌పై కామెడీ పంచులు విసిరిన సీఎం రేవంత్
అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లుపై జరుగుతున్న చర్చలో సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బీసీ రిజర్వేషన్ బిల్లులోని కొన్ని అంశాలని గంగుల కమలాకర్ వ్యతిరేకించడంతో.. ‘గంగులన్నా భయపడకు.. ఏమన్నా అయితే నేను చూసుకుంటా!’ అంటూ రేవంత్ కామెడీ పంచులు విసిరారు. అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లుపై జరుగుతున్న చర్చలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగింది. బీసీ బిల్లుపై రాహుల్ గాంధీ కేంద్ర స్థాయిలో ఎందుకు మాట్లాడటం లేదని కేటీఆర్ ప్రశ్నించగా.. దానికి సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగింది. బీసీ బిల్లుపై రాహుల్ గాంధీ కేంద్ర స్థాయిలో ఎందుకు మాట్లాడటం లేదని కేటీఆర్ ప్రశ్నించగా.. దానికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ.. రాహుల్ గాంధీ చెప్పకుండానే ఇదంతా జరుగుతుందా ? అని బీఆర్ఎస్‌ని ప్రశ్నించారు. ముందు 22 నెలలుగా అసెంబ్లీకి రాని కేసీఆర్‌ని సభకి తీసుకురండి అన్నారు.





















