Sunil Gavaskar Requests Pant Somersault | సూపర్ సెంచరీ కొట్టి సూపర్ అన్న గవాస్కర్ కే అంకితమిచ్చిన పంత్ | ABP Desam
ఇంగ్లండ్ తో హెడింగ్లేలో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ అదరగొడుతోంది. ప్రత్యేకించి రెండో ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ సెంచరీలతో విరుచుకుపడిన విధానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మొదటి ఇన్నింగ్స్ లో స్వల్ప ఆధిక్యమే దక్కినా రెండో ఇన్నింగ్స్ లో గోడలా పాతుకుపోయి రాహుల్ ఆడితే...తనదైన స్టైల్ లో క్రేజీ షాట్స్ తో రెచ్చిపోయాడు రిషభ్ పంత్. 140 బాల్స్ లో 15 ఫోర్లు 3 సిక్సర్లతో వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడిన పంత్ 118 పరుగులు చేసిన రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీ బాదేసి ఇంగ్లండ్ లో ఇంగ్లండ్ పై ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. సెంచరీ పూర్తి చేయగానే పిల్లి మొగ్గలు వేయటం పంత్ కి అలవాటు. మొదటి ఇన్నింగ్ స్ లో సెంచరీ తర్వాత వేశాడు కూడా అప్పుడు ఆస్ట్రేలియా టూర్ లో తనను తిట్టిన సునీల్ గవాస్కర్ తోనే సూపర్ సూపర్ అని ప్రశసించుకునేలా చేశాడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టిన పంత్ ను మళ్లీ పిల్లిమొగ్గలు వేయాలని సునీలా గవాస్కర్ బాల్కనీ నుంచి కోరినా వేయని పంత్..కంటి కి సూపర్ సింబల్ అని పెట్టి తన సెంచరీ ని సునీల్ గవాస్కర్ కి డెడికేట్ చేస్తున్నట్లు చెప్పకనే చెప్పాడు. అయితే గవాస్కర్ రిక్వెస్ట్ చేసినా కూడా సోమర్ సాల్ట్ కొట్టకుండా నెక్ట్స్ టైమ్ అంటూ పంత్ బదులివ్వటం చూస్తుంటే తర్వాతి టెస్టుల్లో మరింత విరుచుకుపడతాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడని అర్థం అవుతోంది.





















