India vs England 4th Test Match | జులై 23 నుండి నాలుగవ టెస్ట్ మ్యాచ్ | ABP Desam
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఈ సిరీస్ లో మూడు మ్యాచులు గెలిచి ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. జూలై 23 నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో నాలుగవ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా గెలిచి తీరాలి. ఈ మ్యాచ్ ఓడిపోయినా... డ్రా అయినా కూడా సిరీస్ చేజారిపోతుంది.
జరిగిన మూడు టెస్ట్ మ్యాచులో వచ్చిన ఫలితాల ఆధారంగా ఈ మ్యాచ్ లో టీం ను సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. మరి ఎవరు టీంలోకి వస్తారు.... ఎవరు బెంచ్ పైకి వెళ్తారో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మాంచెస్టర్ గ్రౌండ్ లో ఇండియా కంటే ఇంగ్లాండ్ విన్నింగ్ పెర్సెంట్ ఎక్కువ. ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ పై భారత్, ఇంగ్లాండ్ మధ్య ఇప్పటివరకు 9 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. అందులో ఇంగ్లాండ్ నాలుగు సార్లు గెలిస్తే మిగిలిన ఐదు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. టీమిండియా ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా గెలవలేదు.
ఈ పిచ్ పై ఇండియా, ఇంగ్లాండ్ 2014లో లాస్ట్ మ్యాచ్ ఆడాయి. అప్పుడు ఇంగ్లాండ్ ఒక ఇన్నింగ్స్‌లో 367 రన్స్ చేస్తే.. ఇండియా రెండు ఇన్నింగ్స్ కలిపి 312 పరుగులు చేసింది. మరి ఈసారి జరిగే మ్యాచ్ డూ ఆర్ డై లాంటిది. గెలిస్తే రికార్డు విజయం అవుతుంది.. ఓడిపోతే మాత్రం సిరీస్ చేజారిపోతుంది. చూడాలి మరి గిల్ సేనా ఈ మ్యాచ్ ని ఎలా మలుపు తిప్పుతారో.





















