IND vs PAK | బుమ్రా బౌలింగ్‌లో 6 సిక్స్‌లు కొడతాడంటే డకౌట్ అయిన అయుబ్ | ABP Desam
ఛాలెంజ్‌లు చేయడం.. ఫెయిల్ అయి పరువు పోగొట్టుకోవడం పాకిస్తాన్ దేశానికే కాదు.. ఆ దేశ క్రికెట్ టీమ్‌కి కూడా బాగా అలవాటు. ఇండియాపై గెలిచేస్తాం.. ఇరగదీస్తాం.. అని ఛాలెంజ్ చేసిన ప్రతిసారీ.. పాక్ పరువు పోతూనే ఉంది. అయినా ఆ దేశ ప్లేయర్లకి, మాజీ ఆటగాళ్లకి ఏ మాత్రం బుద్ధి రాదు. రీసెంట్‌గా కూడా అలాంటి పరువు పోగొట్టుకునే ఛాలెంజే ఇంకొటి చేసి మళ్లీ పరువు పోగొట్టుకుంది పాక్. అసలేం జరిగిందంటే.. ఆసియా కప్ స్టార్ట్ కావడానికి ముందే.. పాక్ ఓపెనర్ సైమ్ అయూబ్‌ని ఆకాశానికెత్తేయడం స్టార్ట్ చేశారు. ‘ఆసియా కప్‌లో మా అయూబ్ రెచ్చిపోతాడు.. పరుగుల సునామీ సృష్టిస్తాడు’ అంటూ ఓ రేంజ్ హైప్ ఇచ్చారు. ఇక పాక్ మాజీ బౌలర్ సొహైల్ తన్వీర్ అయితే ఇంకో అడుగు ముందుకేసి ఇండియాన్ పేస్ స్టార్, వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ బుమ్రానే టార్గెట్ చేశాడు. ‘బుమ్రా బౌలింగ్‌లో మా అయూబ్ 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొడతాడు’ అంటూ పిచ్చ ఛాలెంజ్ చేశాడు. కానీ కట్ చేస్తే.. నిన్న పసికూన.. ఆసియాకప్ డెబ్యూ చేస్తున్న ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో అయూబ్ ఫస్ట్ బంతికే గోల్డెన్ డక్‌గా అవుటై పెవిలియన్ చేరాడు. ఈ దెబ్బతో సోషల్ మీడియాలో తన్వీర్ కామెంట్స్‌పై ట్రోల్స్ మొదలయ్యాయి. ‘ఏరా అయ్యా? వరల్డ్ నెంబర్ 1 బౌలర్ బుమ్రా బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టేది వీడేనా..? పిల్ల దేశం ఒమన్ చేతిలో గోల్డెన్ డక్ అవుటయ్యాడు కదరా..?’ అని కొంతమంది కామెంట్ చేస్తుంటే.. ఇంకొంతమందేమో.. ‘బుమ్రా బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టే బ్యాటర్ ఒమన్ చేతిలో గోల్డెన్ డక్ అయ్యాడోచ్.. మీకెందుకురా ఛాలెంజ్‌లు?’ అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.





















