US Election Results 5 Reasons for Kamala Harris Defeat
డొనాల్డ్ ట్రంప్‌ను నాలుగేళ్ల క్రితం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ ఓడించారు. కట్ చేస్తే ఇప్పుడు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ నే ట్రంప్ చిత్తుగా ఓడించారు. కమలా హ్యారిస్ ఓటమికి ప్రధానంగా 5 కారణాలు చెప్పుకోవచ్చు.
1. పైకి పీస్ ఫుల్ నెస్, ప్రపంచ శాంతి అని చెప్తూనే జో బైడెన్ ప్రభుత్వం పరోక్షంగా యుద్ధాలను పెంచి పోషించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్‌కి భారీగా ఆయుధ, ఆర్థిక సాయం చేసింది. ఇటు ఇజ్రాయెల్ -ఇరాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ కు బాగా సపోర్ట్ చేసింది. చైనా విషయంలోనూ బైడెన్ అత్యంత బలహీనంగా కనిపించారు. పైగా ట్రంప్ తాను అధికారంలోకి వస్తే వారంలో యుద్ధాన్ని ఆపేస్తానని హామీ ఇవ్వడం.. ఆయనకు బాగా కలిసొచ్చింది.
2. ఉక్రెయిన్ యుద్ధప్రభావంతో అన్ని దేశాలతోపాటే అమెరికాపైనా ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంఅయింది. పైగా ఉద్యోగాల్లో కోతలు పెట్టడం.. అమెరికన్లలో బైడెన్ పై ఆగ్రహాన్ని పెంచాయి. ఇలా యూఎస్ ఆర్థికస్థితి దారుణంగా ఉంటే... వందల కోట్ల డాలర్లను ఉక్రెయిన్‌కు సాయం చేయడాన్ని అమెరికన్లు బాగా వ్యతిరేకించారు.
3. జో బైడెన్ వయసు పైబడి... ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నా.. మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ప్రజలకు విసుగెత్తింది. ఆయన స్థానంలో కమలా హారిస్‌ను హడావుడిగా అభ్యర్థిగా ప్రకటించినా కూడా బైడెన్ అసమర్థ పాలన ఆమె మెడకు చుట్టుకుంది. పైగా బైడెన్ ప్రభుత్వంలో వైస్ ప్రెసిడెంట్ ఆమెనే కాబట్టి, ఆ ప్రభుత్వ నిర్ణయాలన్నింటిలో కమల పాత్ర కూడా ఉన్నట్లు ప్రజలు భావించారు.
4. ట్రంప్‌తో పోలిస్తే కమలా హ్యారిస్ ప్రసంగాలు చాలా పేలవంగా ఉంటాయనే పేరు వచ్చింది. ప్రచారంలో పలు ప్రశ్నలకు కూడా దాటవేత సమాధానాలివ్వడం కూడా కమలా హ్యారిస్ కు మైనస్ అని చెప్తారు.
5. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా వలసలపై, పెరిగిన ద్రవ్యోల్బణాన్ని బాగా ప్రస్తావించారు. బైడెన్ హయాంలో లక్షల సంఖ్యలో అక్రమంగా వలసలు వచ్చారని ట్రంప్ లెక్కలతో చూపించి... అమెరికన్లను ఆకట్టుకున్నారు. అదీకాక వరుసగా రెండుసార్లు జరిగిన హత్యాయత్నాలు ట్రంప్ కు సానుభూతిగా కలిసొచ్చాయి. ఈ 5 అంశాలు ప్రధానంగా కమలా హ్యారిస్‌కు నష్టం కలిగించాయి.
![Elon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/09/6027f631b47c86aadea3a1699f22f7a91739114934636310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Darien Gap Crossing in Telugu | మానవ అక్రమరవాణాకు దారి చూపెడుతున్న మహారణ్యం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/07/6bf701a72078ab0b8386308ed53fe2001738947050082310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Minister Jai Shankar on Deportation | మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయరు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/06/6a5470a2806d7927d3e8be319ef80c6b1738854494471310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Sheikh Hasina Home Set on Fire | షేక్ హసీనా తండ్రి నివాసాన్ని తగులబెట్టిన ఆందోళనకారులు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/06/97201eb57e0c77a93bf33d51cff2efac1738854299867310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Illegal Immigrants Deportation | పార్లమెంటులో భగ్గుమన్న ప్రతిపక్షాలు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/06/7c0b94ed5abf3075be1060b5fcc2a4d21738854113515310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)