Allu Arjun Attended SIIMA 2025 | దుబాయ్ గ్రాండ్ గా మొదలైన సైమా వేడుకలు | ABP Desam
దుబాయ్ లో మొదలైన సైమా అవార్డ్స్ జోష్ కనిపిస్తోంది. శుక్రవారం, శనివారాల్లో జరిగే ఈ వేడుకల కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక దుబాయ్ లో అడుగుపెట్టారు. పుష్ప సినిమా ద్వారా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఈ జంట సైమా వేడుకల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ కానున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు చాలా మంది స్టార్స్ ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో సందీప్ కిషన్...కిరణ్ అబ్బవరం దుబాయ్ కు చేరుకుని అక్కడి అభిమానులను పలకరించారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషా చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులను అందచేసి సత్కరించే సైమా వేడుకల్లో ఇప్పుడు జరగుతున్నది 13వ ఎడిషన్. దక్షిణాది సినిమాల్లో సత్తా చాటిన నటీ నటులకు, సాంకేతిక నిపుణుల ప్రతిభకు పట్టం కట్టేలా సైమా అవార్డుల వేడుకలను గల్ఫ్ దేశంలో నిర్వహిస్తున్నట్లు సైమా అవార్డుల వేడుకల నిర్వాహకులు తెలిపారు.





















