అన్వేషించండి
Guntur Crime: గుంటూరు బీటెక్ విద్యార్థిని హత్య సీసీ కెమెరా దృశ్యాలు
గుంటూరులో ఘోరం జరిగింది. కఠిన చట్టాలు అమలు చేస్తోన్న మహిళలపై దాడులు మాత్రం ఆగడంలేదు. గుంటూరులోని పరమాయికుంట వద్ద టిఫిన్ తీసుకెళ్లేందుకువచ్చిన ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనతో గుంటూరు ఉలిక్కిపడింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గుంటూరు పెదకాకాని రోడ్డులోని పరమాయికుంటలో టిఫిన్ తీసుకెళ్లేందుకు వచ్చిన యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులో ఉన్న బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తోండగా మార్గమధ్యలో చనిపోయింది. యువతిపై కత్తితో దాడి చేస్తున్న సమయంలో అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ దుండగుడు స్థానికులను కత్తితో బెదిరించి ద్విచక్రవాహనంపై పరారయ్యాడు.
వ్యూ మోర్





















