Weather Updates Today: హీటెక్కుతున్న ఏపీ, కొన్ని జిల్లాల్లో వర్షాలతో కూల్ కూల్‌గా తెలంగాణ
AP Weather News: కొన్ని రోజుల కిందటి వరకు ఏపీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. చలి తగ్గుతుండటంతో రాష్ట్రంలో వేడి అధికం కానుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Weather In AP And Telangana: తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని రోజుల కిందటి వరకు ఏపీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ప్రస్తుతం ఇక్కడ సైతం కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో చలి ప్రభావం తగ్గనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రాష్ట్రాల్లోనూ నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి చలిగాలులు తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉండనుంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగుతుంది. రెండు వైపుల నుంచి వీచే గాలులతో ఉదయం వేళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని లేదని అధికారులు సూచించారు. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణం కాస్త వేడిగా మారనుంది. వర్ష సూచన లేకపోవడంతో రైతులు ధాన్యం విషయంలో ఆందోళన చెందనక్కర్లేదని అధికారులు పేర్కొన్నారు.
7 day Mid day forecast of Andhra Pradesh dated 09.02.2022 https://t.co/MyXCwH2Y8i
— MC Amaravati (@AmaravatiMc) February 9, 2022
చలి కాలం ముగిసింది కనుక రాత్రులు ఏపీలో వెచ్చగా ఉంటుంది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో వెచ్చటి రాత్రులు, రాయలసీమ జిల్లాల్లో మాత్రం కాస్తంత చల్లగా ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే కొన్ని రోజులపాటు వర్షాలు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం లేనందున మధ్యాహ్నం వేడి పెరుగుతుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుంది. కిందటి రోజుతో పోల్చితే కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని రోజుల కిందటి వరకు 18 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో నమోదు కాగా.. రెండు మూడు రోజుల్లో కనిష్ణ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు దాటే అవకాశం ఉందని అంచనా వేశారు.
తెలంగాణలో వర్షాలు..
తెలంగాణలో నేడు సైతం ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆదిలాబాద్, కొమురంభీమ్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో పలు చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది. అయితే వర్షాల నేపథ్యంలో ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదు. ఆగ్నేయ దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీస్తున్నాయి. వర్ష ప్రభావం లేని చోట కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.