అన్వేషించండి

AP New Districts : ఉగాది నుంచి ఏపీలో కొత్త జిల్లాలు - సీనియర్లే కలెక్టర్లు, ఎస్పీలుగా ఉంటారన్న సీఎం జగన్

ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగాది నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం కావాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉగాది నుంచే కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని సీఎం జగన్‌ ( CM Jagan ) ప్రకటించారు. కొత్త జిల్లాలు ( New Districts ) ప్రక్రియపై ఉన్నతాధికారులతో సమీక్ష నిరవహించారు. ఉగాది నుంచే కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉందని దానికి సంబంధించిన సన్నాహాలు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. ప్రస్తుతమున్న కలెక్టర్లు, ఎస్పీలకు కొత్త జిల్లాల బాధ్యతలు అప్పగించాలన్నారు. వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. పరిపాలన సాఫీగా సాగడానికి వీరి అనుభవం ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు. కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ వచ్చిన రోజునుంచే ఓఎస్డీల హోదాలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. 

షోలు, టిక్కెట్ రేట్ల పెంపు, విశాఖలో స్థలాలు - టాలీవుడ్ ప్రముఖులకు జగన్ వరాలు !

కొత్త జిల్లాల ఏర్పాటుపై వస్తున్న అభ్యంతరాలు, ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలపైనా సీఎం జగన్ చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో ( Andhra Pradesh )  ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను పునర్‌వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ గత నెల 25న నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ చర్యలు చేపట్టింది.కొత్త జిల్లాల ఏర్పాటు. పై పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. 

మళ్లీ సెంటిమెంట్ అస్త్రాన్ని అందుకునే పనిలో టీఆర్ఎస్ - మోదీ మాటలతో రాజకీయ కార్యాచరణ !

కడపలో రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే, రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అన్ని పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. అనంతపురం జిల్లాలో పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. దీంతో హిందూపురంలో ఆందోళనలు మొదలయ్యాయి. అన్ని సదుపాయాలు ఉన్న హిందూపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు ఉద్యమిస్తున్నాయి. నోటిఫికేషన్‌ జారీ చేసిన 30 రోజుల్లోగా జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. 

ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నారు. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి.. అవసరమైతే రీ-నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. అన్నీ పరిశీలించి ఎక్కువ అభ్యంతరాలు ఉన్న చోట రీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే సీఎం జగన్ చెప్పినట్లుగా ఉగాది నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం కావాలంటే అనేకరకాలైన మౌలిక సదుపాయాలు కల్పించుకోవాల్సి ఉంటుందని అధికారవర్గాలు భావిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Tirumala: శ్రీవారికి ఏ రోజు ఏ ఆభరణాలు? కొత్త భక్తుడు ఇచ్చే 121 కిలోల బంగారు నగలు ఎప్పుడు వేస్తారు?
శ్రీవారికి ఏ రోజు ఏ ఆభరణాలు? కొత్త భక్తుడు ఇచ్చే 121 కిలోల బంగారు నగలు ఎప్పుడు వేస్తారు?
శ్రీవారికి 121 కిలోల బంగారం: 11 టన్నులకు పైగా తిరుమలేశుడి ఆభరణాల సంపద!
శ్రీవారికి 121 కిలోల బంగారం: 11 టన్నులకు పైగా తిరుమలేశుడి ఆభరణాల సంపద!
Trainee IPS Harassment Case: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు చేర్చిన పోలీసులు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు
CM Chandrababu: ఏపీలో రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, అధికారులకు కీలక ఆదేశాలు
ఏపీలో రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, అధికారులకు కీలక ఆదేశాలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trainee IPS Harassment Case: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు చేర్చిన పోలీసులు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
MIM Murtuza Pahalwan Murder: శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
లాంచ్‌కు ముందే షోరూమ్‌లో దర్శనమిచ్చిన Bajaj Pulsar 125 Neon.. పాత క్లాసిక్ లుక్‌తో అదరగొడుతున్న బైక్!
తక్కువ ధరలో కొత్త పల్సర్ 125 వస్తోందా? లాంచ్‌కు ముందే కనిపించిన Bajaj Pulsar 125 Neon
Contaminated Drinking Water : కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కార్తీక పౌర్ణమి 2026: ఇంటి పైకప్పుపై ఆకాశ దీపం.. పితృ మోక్షం, శ్రేయస్సు
కార్తీక పౌర్ణమి 2026: ఇంటి పైకప్పుపై ఆకాశ దీపం.. పితృ మోక్షం, శ్రేయస్సు
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ
Renigunta Temple Removal: రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
Embed widget