RTC Bus Accident: వికారాబాద్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం
ఈ ప్రమాదానికి ఆర్టీసీ బస్సు అతి వేగంతో వెళ్లడమే కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఆర్టీసీ బస్సు సంగారెడ్డి నుంచి తాండూర్ వైపు వెళ్తున్నట్లుగా గుర్తించారు.
వికారాబాద్ జిల్లా ఆర్టీసీ బస్సుకు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మర్పల్లి మండలం కల్కొడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సులో ఉన్న 30 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. దీంతో స్థానికులు వెంటనే క్షతగాత్రుల్ని మర్పల్లి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి ఆర్టీసీ బస్సు అతి వేగంతో వెళ్లడమే కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఆర్టీసీ బస్సు సంగారెడ్డి నుంచి తాండూర్ వైపు వెళ్తున్నట్లుగా గుర్తించారు. ఈ ఆర్టీసీ బస్సు కల్కొడ చౌరస్తా వద్దకు రాగానే బోల్తా పడింది. బస్సులో 60 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: వందేళ్ల తర్వాత కాశీకి చేరిన అన్నపూర్ణ విగ్రహం...ఈ నెల 15న పున:ప్రతిష్టాపన
అతి వేగమే ప్రమాదానికి కారణం..!
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కల్కొడ వద్ద టీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. సంగారెడ్డి నుంచి తాండూర్ వైపు వెళ్తోన్న ఆర్టీసీ బస్సు కల్కొడ చౌరస్తా వద్ద బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ ప్రయాణికులను మర్పల్లి ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదానికి అతి వేగమే కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. కల్కొడ గ్రామం సమీపంలో రహదారి ఎత్తుపల్లాలను డ్రైవర్ అంచనా వేయలేకపోవడంతో ప్రమాదం జరిగిందన్నారు. అప్పటికే వేగంలో ఉన్న బస్సును డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయారు. ఈ క్రమంలోనే బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కకు బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Also Read: Hyderabad: మటన్ కత్తితో ఫ్రెండ్ గొంతు కోసేసి హత్య.. కారణం తెలిసి అవాక్కైన స్థానికులు
Also Read: విగ్గు ధరించి వ్యక్తి అరాచకం, జోరుగా సహజీవనం.. అందినకాడికి దండుకొని చివరికి..
Also Read: విరాట్ కోహ్లీ కూతుర్ని అంత మాట అనేస్తాడా!! సంగారెడ్డి వ్యక్తి అరెస్టు
Also Read: పంచ్ ప్రభాకర్ కోసం ఇంటర్‌పోల్ బ్లూ నోటీస్ ! ఆచూకీ తెలిసిన వెంటనే అరెస్ట్ ?
Also Read: పేకాట బిజినెస్‌లో నాగశౌర్య తండ్రి కూడా పార్టనరే..! అరెస్ట్ చేసిన పోలీసులు.. బెయిలిచ్చిన కోర్టు !
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..