By: ABP Desam | Updated at : 10 Nov 2021 05:39 PM (IST)
తండ్రితో నాగశౌర్య ( ఫైల్ ఫోటో )
హైదరాబాద్ శివారులోని మంచిరేవుల ఫామ్‌హౌస్‌లో పేకాట కాసినో వ్యవహారంలో టాలీవుడ్ హీరో నాగ శౌర్య తండ్రి శివలింగ ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకూ గుత్తా సుమన్ కుమార్ అనే వ్యక్తి మాత్రమే ఈ రాకెట్‌ను నడిపిస్తున్నారని అనుకున్నారు. కానీ నాగశౌర్య తండ్రి కూడా భాగస్వామేనని ఆధారాలు లభించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అరెస్టయిన వెంటనే శివలింగ ప్రసాద్ విడుదలయ్యారు.
Also Read : బట్టలిప్పేసి నగ్నంగా పక్కింటికి వెళ్లిన యువకుడు.. ఏం చేశాడంటే..!
వారం రోజుల కిందట ఎస్వోటీ పోలీసులు మంచి రేవుల ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. ఆ సమయంలో పలువురు ప్రముఖులతో పాటు గుత్తా సుమన్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఆ ఫామ్‌హౌస్‌ను హీరో నాగశౌర్య తండ్రి మూడేళ్ల పాటు లీజుకు తీసుకుని ఉండటంతో వారికి కూడా పాత్ర ఉందని పోలీసులు అనుమానించారు. అయితే గుత్తా సుమన్ కుమార్ పుట్టినరోజు పార్టీ కోసం తాను ఫామ్‌హౌస్‌ను రెంట్‌కు తీసుకున్నానని చెప్పుకొచ్చారు. అయితే ఇందులో నాగ శౌర్య తండ్రితో పాటు బాబాయ్ పేరు కూడా బయటికి వచ్చింది.
Also Read: 16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. కాపాడిన్ టిక్ టాక్.. ఎలా అంటే..?
క్యాసినో కింగ్‌పిన్ గుత్తా సుమన్‌తో కలిసి కొన్ని రోజులుగా నాగ శౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. నిన్నమొన్నటి వరకు నాగ శౌర్య తండ్రి పేరు ఈ కేసులో కాస్త తక్కువగానే వినిపించింది. పోలీసులు సేకరించిన ఆధారాలతో ఆయన పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. అరెస్ట్ చేసిన వెంటనే బెయిల్ లభించింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని శివ లింగ ప్రసాద్‌ను కోర్టు ఆదేశించింది.
Also Read: క్షమాభిక్ష లేదని కోర్టు చెప్పేసింది.. కొన్ని గంటల్లోనే ఉరి శిక్ష.. అప్పుడే ఊహించని ట్విస్ట్
పేకాట, మినీ కేసినోల నిర్వహణలో చాలా పెద్ద రాకెట్ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. స్టార్ హోటళ్లలోనూ వీటిని నిర్వహిస్తున్నారని ఇప్పటికే ఆధారాలు సేకరించారు. వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Woman Fraud: కాబోయే భార్యే కదా అని నమ్మితే ఊహించని ట్విస్ట్! బాధితుడు లబోదిబో
Varalaxmi Tiffin Center Drugs Case: వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ యజమానితో అనురాధ ప్రేమాయణం, అతడి కోసమే డ్రగ్స్ దందా
Adilabad: భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య, మరోఘటనలో చెంపపై కొట్టి హత్య!
Nalgonda: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- బైక్, కారు ఢీకొని ఐదుగురు మృతి
Telangana: అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్ - బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు
BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు
Chandrababu Arrest: చంద్రబాబు విజినరీ లీడర్ కాదు ప్రిజీనరీ లీడర్ : మాజీ మంత్రి కన్నబాబు
Telangana Assembly Elections 2023: చేతులు కలిపిన ప్రత్యర్థులు- ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన రాజయ్య, కడియం
Canada Singer Shubh: భారత్ నా దేశం కూడా-నేనూ ఇక్కడే జన్మించా : కెనడా సింగర్ శుభ్
Paper Pens: ఏపీలో వెరైటీగా పేపర్ పెన్నులు -ఈ పెన్నులు మొలకెత్తుతాయి కూడా
/body>