Hyderabad: బట్టలిప్పేసి నగ్నంగా పక్కింటికి వెళ్లిన యువకుడు.. ఏం చేశాడంటే..!
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని నేరేడ్‌మెట్ ప్రాంతం సంతోష్ నగర్ కాలనీలో ఉంటున్న ఓ 18 ఏళ్ల యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే, అతను శనివారం రాత్రి విచిత్రంగా ప్రవర్తించినట్లు స్థానికులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి వేళ ఓ యువకుడు వింతగా, చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. అతని తీరు చూసి చుట్టుపక్కల వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి కనీసం ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేకుండా పక్కన ఉన్న మరో ఇంట్లోకి ప్రవేశించాడు. నేరేడ్‌మెట్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది.
Also Read: 16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. కాపాడిన్ టిక్ టాక్.. ఎలా అంటే..?
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని నేరేడ్‌మెట్ ప్రాంతం సంతోష్ నగర్ కాలనీలో ఉంటున్న ఓ 18 ఏళ్ల యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే, అతను శనివారం రాత్రి విచిత్రంగా ప్రవర్తించినట్లు స్థానికులు తెలిపారు. ఆ యువకుడు తన ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా మారి పక్కన ఉన్న మరో ఇంట్లోకి ప్రవేశించాడు. వారి కిటికీలో నుంచి లోనికి తొంగి చూశాడు. ఈ విషయాన్ని గమనించిన చుట్టు పక్కల వారు వెంటనే అప్రమత్తమై ఆ యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ ఇంటివారిని నిద్ర లేపారు. అయితే వాళ్లు వచ్చేలోపే ఆ యువకుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.
ఈ యువకుడి వింత ప్రవర్తనతో ఆందోళన చెందిన బాధిత కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఆ యువకుడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.
Also Read: క్షమాభిక్ష లేదని కోర్టు చెప్పేసింది.. కొన్ని గంటల్లోనే ఉరి శిక్ష.. అప్పుడే ఊహించని ట్విస్ట్
రెండు బైక్‌లు ఢీ.. ఒకరు దుర్మరణం
మరోవైపు, హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఆర్డీఎల్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Also Read: Nalgonda: గుడిలో పూజారి.. చేసింది మాత్రం పాడు పని.. భార్య కూడా సహకారం, షాక్ అయిన పోలీసులు