(Source: ECI/ABP News/ABP Majha)
TikTok: 16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. కాపాడిన్ టిక్ టాక్.. ఎలా అంటే..?
16 ఏళ్ల బాలిక కిడ్నాపైంది. ఆమెను టిక్ టాక్ కాపాడింది. ఏంటి నమ్మట్లేదా? నిజం ఆమె టిక్ టాక్ వీడియోల కారణంగానే తప్పించుకుంది.
నార్త్ కరోలినాలో ఓ 16 ఏళ్ల బాలిక కిడ్నాప్ కు గురైంది. ఒకవిధంగా చెప్పాలంటే ఆమె ప్రాణాలను టిక్ టాక్ కాపాడింది. అది ఎలా అనుకుంటున్నారా? ఆమె చేసిన సంజ్ఞల ఆధారంగా ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది అనుకోవచ్చు. కిడ్నాప్ కు గురైన అమ్మాయిని నిందితుడు కారులో తీసుకెళ్తున్నాడు. ఆ సమయంలో కారు అద్దాలకు కనిపించేలా.. ఆ అమ్మాయి సహాయం కోసం సిగ్నల్స్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఓ వ్యక్తి గమనించి వెంటనే పోలీసులకు.. సమాచారం ఇచ్చాడు. అయితే దీంతో టిక్ టాక్ కు సంబంధమేంటి అనుకుంటున్నారా? ఉంది తప్పకుండా ఉంది.
పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి.. వాహనంలో అమ్మాయిని తీసుకెళ్లడం గమనించాడు. అయితే 16 ఏళ్ల అమ్మాయి... వాహనంలో నుంచి గృహ హింసను నుంచి సూచించే సిగ్నల్ ఇచ్చింది. ఈ సిగ్నల్ టిక్ టాక్ లో అంతకుముందు చాలా వైరల్ అయింది. గృహ హింస నుంచి సాయం కావాలని.. ఆ అమ్మాయి ఇచ్చిన సిగ్నల్ కు అర్థం. వెంటనే ఇది గమనించిన రోడ్డు మీద ఉన్న వ్యక్తి.. పోలీసులకు ఫోన్ చేశాడు. అమ్మాయి సమస్యలో ఉన్నట్టు గుర్తించానని చెప్పాడు. వాహనం నడిపేది.. మగ వ్యక్తి అని తెలిపాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు బాలికను కాపాడారు.
అయితే తనను కిడ్నాప్ చేసింది తెలిసిన వ్యక్తేనని..ఉత్తర కరోలినా, టేనస్సీ, కెంటుకీ మరియు ఒహియోల గుండా ప్రయాణించానని అమ్మాయి తెలిపింది. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని వెల్లడించింది. పోలీసులు నిందితుడు జేమ్స్ హెర్బర్ట్ బ్రిక్‌ను అరెస్టు చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జైలు శిక్ష విధించారు.
సిగ్నల్ అనేది బాధలో ఉన్నప్పుడు, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చెప్పేందుకు.. ఎదుటి వారికి తెలిసేలా ఉపయోగించే సంకేతం. కెనడియన్ ఉమెన్స్ ఫౌండేషన్ ఈ ప్రచారాన్ని 2020లో ప్రారంభించింది. సమస్యలను ఎదుర్కొనే వారి కోసం చేతి సంజ్ఞను చాలా కాలంగా ప్రచారం చేసింది. గృహ హింస, ప్రస్తుతం సమస్యల్లో ఉన్నాను అనే చూపే.. సంకేతాన్ని తెలిపింది. అయితే ఆ సిగ్నల్స్ సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా టిక్ టాక్ వీడియోల్లో ట్రెండ్ అయ్యాయి. వాటి నుంచే చూసి నేర్చుకున్న ఆ బాలిక ఇప్పుడు తనకు సాయం కోసం సిగ్నల్స్ ఇచ్చింది. తాను ఆపదలో ఉన్నానని.. సాయం కావాలని చేతితో సంజ్ఞలు చేసి కిడ్నాప్ నుంచి బయటపడింది.
Also Read: Naked Man In Theater: మూవీ థియేటర్ గోడలో నగ్నంగా వ్యక్తి.. కొన్ని రోజులుగా అందులోనే.. ఎలా దూరావయ్య?