(Source: ECI/ABP News/ABP Majha)
Treasure Hunt: ప్రపంచంలోనే అతి పెద్ద నిధి.. తవ్వితే ఇంకాస్త దగ్గరలోనే.. వజ్రాలు, వైడూర్యాలు.. లక్ష కోట్ల పైమాటే
లంకెబిందెల గురించి.. వినే ఉంటారు కదా. ఎక్కడైనా దొరికితే.. అబ్బా.. మనకు దొరికితే ఎంత బాగుండు అనుకుంటాం కదా. అలాంటిది లక్ష కోట్ల నిధి.. దగ్గరలోనే ఉంది అంటే మాటాలా?
లంకెబిందెల గురించి వింటనే అబ్బ చా.. మిస్ అయ్యామే.. ఆ ఊరిలో ఉంటే.. లైఫ్ సెట్ రా బాబు అనుకుంటాం. అలాంటిది లక్ష కోట్ల నిధి అంటే.. మమూలు విషయం కాదు కదా. అన్ని సౌకర్యాలూ కాళ్ల ముందుకు వస్తాయి. ఎలా అంటే అలా బతికేయోచ్చు. అలాంటిది లక్ష కోట్ల నిధి కోసం వేట సాగుతోంది. అది ఒకటి రెండు ఏళ్ల నుంచి కాదు. చాలా ఏళ్ల నుంచే సాగుతోంది. దాదాపు లక్ష కోట్లకుపైగా నిధి విలువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిధి వేటలో ట్విస్టులు కూడా ఉన్నాయి.
ఇంతసేపు చెప్పుకున్న నిధి.. ఫిన్ లాండ్ దేశంలో ఉంది. ఈ నిధి కోసం 34 ఏళ్లుగా 'ట్వెల్వ్ టెంపుల్' టీమ్ చాలా కష్టాలు పడుతుంది. ఇందులో చాలా దేశాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. ఫిన్ లాండ్ రాజధాని హెల్సింకికి తూర్పున 20 మైళ్ల దూరంలో సిబ్బోస్‌బర్గ్ గుహలో ఇది ఉంది. దాదాపు లక్ష కోట్ల వరకు నిధి ఉంటుందని అంచనా. ఇది ఇప్పటివరకు కనుగొన్న.. అత్యంత విలువైన నిధి. వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, రత్నాలు, పురాతన కళాఖండాలు వంటిని ఇందులో ఉంటాయని పరిశోధకులు, చరిత్రాకారులు చెబుతున్నారు. భూగర్భ ఆలయంలో నిధి దాచి పెట్టారని అంటున్నారు. 34 ఏళ్లుగా ఈ ప్రాంతంలో అన్వేషణలు జరుగుతున్నప్పటికీ, నిధిని ఎవరూ కనుగొనలేకపోయారు. చలికాలం వస్తే చాలు.. గుహలో నీరంతా గడ్డ కట్టుకుపోతుంది. దశాబ్దాలుగా ఇక్కడే క్యాంపు వేసుకుని ఉంటున్నారు.
ఇప్పుడు నిధికి దగ్గరలో ఉన్నామని ఆ టీమ్ మెంబర్స్ చెప్పడంతో మళ్లీ.. ఫిన్ లాండ్ లక్షకోట్ల నిధి వార్తల్లోకి ఎక్కింది. గణనీయమైన పురోగతి సాధించారని.. వచ్చే కొంత కాలం గురించి సిబ్బంది ప్రత్యేకంగా ఉత్సాహంగా ఉన్నారని చరిత్రాకారుడు కార్ల్ బోర్గెన్ అంటున్నారు. ప్రస్తుతం నిధికి దగ్గరలో ఉన్నట్టు.. చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ నిధి విషయం నిజమైతే.. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత విలువైన నిధిగా చరిత్రలోకి ఎక్కుతుంది.
ఇక్కడ ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే.. 34 ఏళ్ల కిందట.. 24 మంది సభ్యులు నిధిని తవ్వడానికి ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం ఆ టీమ్ లోని ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు. కొంతమంది చనిపోతే.. మరికొంతమంది వెనక్కు వెళ్లిపోయారు. అయితే ఆ నిధి అక్కడికి ఎలా వచ్చిందనే దాని మీద స్పష్టత లేదు.
Also Read: Asteroid Towards Earth: 'F16'.. F2 సీక్వెల్ కాదు.. అంతకుమించి! దాక్కో దాక్కో.. దూసుకొస్తోంది!
Also Read: Hidden Camera: స్కూల్ బాత్రూంలో సీసీ కెమెరాలు.. షాకైన అధికారులు.. రిజిస్ట్రేషన్ రద్దు!