Hidden Camera: స్కూల్ బాత్రూంలో సీసీ కెమెరాలు.. షాకైన అధికారులు.. రిజిస్ట్రేషన్ రద్దు!
విద్యార్థుల బాత్రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది ఓ స్కూల్ యాజమాన్యం. అయితే ఇందుకు వాళ్లు చెప్పిన కారణం విని అధికారులే షాకయ్యారు.
![Hidden Camera: స్కూల్ బాత్రూంలో సీసీ కెమెరాలు.. షాకైన అధికారులు.. రిజిస్ట్రేషన్ రద్దు! Pakistan: Hidden Cameras Found In Both Mens Womens School Washrooms karachi; License Cancelled Hidden Camera: స్కూల్ బాత్రూంలో సీసీ కెమెరాలు.. షాకైన అధికారులు.. రిజిస్ట్రేషన్ రద్దు!](https://static.abplive.com/wp-content/uploads/sites/2/2019/02/06165211/higene-1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఓ స్కూల్ యాజమాన్యం చేసిన పని చూసి అందరూ షాకయ్యారు. ఏకంగా అబ్బాయిలు, అమ్మాయిల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలను ఏర్పాటు చేసింది స్కూల్ యాజమాన్యం. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆ స్కూల్ లైసెన్స్‌ను రద్దు చేశారు.
అసలు ఏం జరిగింది?
కరాచీలోని సఫూరా గోత్‌లో ఉన్న హారాక్స్ పాఠాశాల ఈ నిర్వాకం చేసింది. ఈ విషయం గురించి నవంబర్ 3న ఓ మహిళా టీచర్ విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాత్రూంలలో రహస్య కెమెరాలను గమనించి ఆ టీచర్.. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బోర్డును కోరినట్లు డాన్ పత్రిక తెలిపింది.
దర్యాప్తులో తేలింది..
ఈ ఫిర్యాదు మేరకు విద్యాశాఖ పాఠశాల్లో తనిఖీలు చేసింది. ఈ తనిఖీలలో చాలా రహస్య కెమెరాలను గుర్తించారు. ముఖ్యంగా వాష్‌రూంలలో కెమెరాలను ఉన్నట్లు తేలింది. దీంతో స్కూల్ యాజమాన్యానికి విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 4న సదరు స్కూల్ ప్రిన్సిపాల్ తమ ముందు హాజరై ఇందుకు కారణం తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం వాష్‌బేసిన్ ప్రాంతంలో ఓ షీట్‌ను ఏర్పాటు చేసి దానికి ఉన్న రంధ్రాల వెనుక రహస్య సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. అమ్మాయిలు, అబ్బాయిల టాయిలెట్స్‌లో వీటిని గుర్తించారు.
అయితే ఈ కెమెరాలలో నిక్షిప్తిమైన వీడియోలు బయటకి వచ్చినట్లు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) తెలిపింది. స్కూల్ యాజమాన్యం మాత్రం ఈ చర్యలు వెనకేసుకొచ్చింది. విద్యార్థి, సిబ్బందిని గమనించేందుకే ఈ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం చెప్పింది.
స్కూల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్..
సింధ్ విద్యాశాఖ మాత్రం స్కూల్ రిజిస్ట్రేషన్‌ను క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే
Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే
Also read: తొలిసారి కరోనాకు చెక్ పెట్టేందుకు టాబ్లెట్... బ్రిటన్ ఆమోదం
Also read:ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)