అన్వేషించండి

KVP Letter to Revanth : తట్టుకోలేకపోతున్నా తప్పయితే కూల్చేసుకుంటా - రేవంత్‌కు కేవీపీ లేఖ

Telangana : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ లేఖ రాశారు. తన ఫామ్ హౌస్ అక్రమం అని కూల్చివేయాలని రేవంత్ అనడంతో మనస్తాపానికి గురై ఈ లేఖ రాశారు.

KVP has written a letter to Telangana CM Revanth Reddy Hydra Issue : నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కేవీపీ ఫామ్ హౌస్ ను కూల్చొద్దా అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇతర నేతల గురించి రేవంత్ చెప్పినా... కేవీపీ  మాత్రం  స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేత. దీంతో ఆయన ఆవేదనా పూర్వకంగా స్పందించారు. తన వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు రావడం ఇష్టం లేదని .. తమ ఫామ్ హౌస్ అక్రమం అయితే కూల్చివేయాలని ఆయన లేఖలో కోరారు. 

కాంగ్రెస్ ముఖ్యమంత్రికి చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరమన్న కేవీపీ 

తనది కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘమైన అనుబంధం ఉందన్నారు. ఇందిరా గాంధీ  హయాంలోనే తాను 33 ఏళ్ల వయసులో గాంధీభవన్ ఇంచార్జ్ గాపని  చేశానని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకు రావడంతో పాటు .. రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా కూడా పని చేశానని లేఖలో రేవంత్‌కు కేవీపీ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని స్వాగతిస్తానన్నారు. తన గురించి ఈ రోజు ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి చెప్పవలసి రావడం బాధాకరమని చెప్పుకొచ్చారు. 

తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు సర్వేలో ఏం అడుగుతున్నారు? మనం ఏం ఇవ్వాలి?

మూసీ ప్రక్షాళన వైఎస్ ప్రారంభించి నిధులు లేక ఆపేశారన్న కేవీపీ              

వైఎస్ హయాంలోనే మూసీ ప్రక్షాళన చేపట్టాలనుకున్నారని  2005లో రూ. 908 కోట్లతో సేవ్ మూసీ అనే ఓ పథకాన్ని కూడా వైఎస్ ప్రారంభించారన్నారు. అయితే ఇతర అభివృద్ది పనులకు ఎక్కువ నిధులు అవసరం కావడం.. మూసి ప్రక్షాళనకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉండంటతో ఆ పనులను అప్పటి వైఎస్ ప్రభుత్వం కొనసాగించలేకపోయిందన్నారు. తాను నల్లగొండ జిల్లా నేరేడు చర్ల మున్సిపాలిటిలో ఓటరుగా నమోదు చేసుకున్నానని మూసీ కాలుష్యం వల్ల అక్కడి వారు పడుతున్న బాధలు చూసి.. మూసి ప్రక్షాళన చేయలేకపోవడంపై బాధపడ్డానన్నారు. 

Also Read: రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!

అజీజ్ నగర్‌లో తన కుటుంబసభ్యులపై ఉన్న  ఫామ్ హౌస్ విషయంలో విపక్షాలు తనను ఓ పావుగా వాడుకోడవడ బాధ కలిగిస్తోదంన్నరు. ఈ విషయం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తనకు బాధకలిగిస్తోందన్నారు. అందుకే అధికారుల్నితన ఫామ్ హౌస్ కు పంపించి... అక్రమాలు ఉంటే మార్క్ చేస్తే.. తన సొంత ఖర్చుతో కూల్చివేస్తానని లేఖలో పేర్కొన్నారు. తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయిపులు వద్దన్నారు. కేవీపీ లేఖతో తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోన్న ఆసక్తి ఏర్పడుతోంది.                               

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
Embed widget