అన్వేషించండి

KTR in luxury cars case: లగ్జరీ కార్ల కేసులో ఈడీ సోదాలు - అరెస్టు చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్ - లింక్ ఎక్కడ ఉందో తెలుసా?

KTR Land Cruiser car: లగ్జరీ కార్ విషయంలో తాను తప్పు చేయలేదని కేటీఆర్ అన్నారు. ఆర్, ఎస్ బ్రదర్స్ అరెస్టు చేసుకుంటే చేసుకోవచ్చని సవాల్ చేశారు.

Luxury car smuggling case:  లగ్జరీ కార్లను స్మగ్లింగ్ చేసి సెకండ్ హ్యాండ్ పేరుతో అమ్మి ప్రభుత్వానికి కోట్ల రూపాయల జీఎస్టీ ఎగవేశారన్న కేసులో కార్ల డీలర్ గా ఉన్న బషరత్ ఖాన్ అనే వ్యక్తి ఇళ్లు,కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ లో 'కార్ లాంజ్' పేరుతో సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్ నిర్వహిస్తున్న  బషరత్ ఖాన్  .. మే 2025లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI)  అరెస్టు చేసింది.    అతను USA, జపాన్ నుంచి లగ్జరీ కార్లు  రోల్స్ రాయిస్, హమ్మర్ EV, ల్యాండ్ క్రూజర్ వంటివి  దుబాయ్, శ్రీలంక రూట్‌లో తీసుకొచ్చి సెకండ్ హ్యాండ్ కార్లుగా చూపి.. ప్రభుత్వానికి  25 నుంచి 100 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.  30కి పైగా కార్లు  ఇంపోర్ట్ చేసుకుని వీఐపీలకు అమ్మాడని ఈడీ గుర్తించింది. 
  
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  కుటుంబసభ్యుల పేరుతో ఉన్న కంపెనీ ద్వారా రిజిస్టర్ నంబర్ TG09D6666తో ఉన్న ల్యాండ్ క్రూయిజర్‌ను  బషరత్ ఖాన్  నుంచి  కొనుగోలు చేశారని ఈడీ గుర్తించింది.  ఈ విషయాన్ని  కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్  బయటపెట్టారు.  బషరత్ ఖాన్ ఇంటరోగేషన్‌లో  కేటీఆర్ కుటుంబానికి అమ్మిన కార్ల గురించి చెప్పాడని ఆ కార్లను బ్లాక్  మనీతో  కొన్నారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. 

ఈ అంశంపై మీడియా సమావేశంలో కేటీఆర్ ను జర్నలిస్టులు ప్రశ్నించారు. కేటీఆర్ ఈ అంశంపై స్పందించారు. తాను తప్పు చేయలేదని..  అరెస్టు చేసుకుంటే చేసుకోవచ్చని అన్నారు. తాను అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆర్ .. ఎస్ బ్రదర్స్ అంటే .. రేవంత్, సంజయ్ సోదరులు ఎన్ని కుట్రలు చేసిన..తప్పు చేయని తనను ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. అయితే ఆ కారును బషరత్ ఖాన్ దగ్గర కొన్నారా  లేదా అన్నది మాత్రం కేటీఆర్ చెప్పలేదు. అలాంటి కార్లను దిగుమతి చేసుకోవాలంటే వంద శాతం పన్నులు కట్టాల్సి ఉంటుంది. అంటే రెండు కోట్ల రూపాయలకు రెండు కోట్ల పన్నులు చెల్లించాల్సి ఉంటుంది .కానీ పన్నులు లేకుండా తీసుకు వచ్చి .. తక్కువ రేటు..సెకండ్ హ్యాండ్ పేరుతో అమ్మేయడం వల్ల ఆ టాక్స్ ను ఎగ్గొట్టవచ్చు. 

ఇప్పుడు ఈడీ కార్లు అమ్మిన బషరత్ ఖాన్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఆయన వద్ద ఉన్నకారు ఎట్ హోం  హాస్పిటాలిటీ  సర్వీసెస్ అనే పేరు మీద రిజిస్టర్ అయి ఉందని ఈడీ గుర్తించినట్లుగా బండి సంజయ్ చెబుతున్నారు. ఈ కంపెనీలో ఓ డైరక్టర్లు గా..  కేటీఆర్‌తోపాటు  కల్వకుంట్ల శైలిమ ఉన్నారు. కేటీఆర్  తోపాటు ఆయన  సతీమణి ఈ కంపెనీలో డైరక్టర్ గా ఉండటంతో.. ఈ లావాదేవీపైనా ఈడీ దృష్టి పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో కేటీఆర్ .. అరెస్టు చేసుకుంటే చేసుకోవచ్చని సవాల్ చేయడం ఆసక్తికరంగా మారింది.                      

 

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP Strategy: తెలంగాణలో పొలిటికల్ వాక్యూమ్ క్లియర్ - బీజేపీకి ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతోంది?
తెలంగాణలో పొలిటికల్ వాక్యూమ్ క్లియర్ - బీజేపీకి ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతోంది?
Konda Surekha: కొండా దంపతుల ప్లాన్ బి - హైకమాండ్ నిర్ణయం వరకూ సైలెంట్ - తర్వాత ఏం చేయబోతున్నారు?
కొండా దంపతుల ప్లాన్ బి - హైకమాండ్ నిర్ణయం వరకూ సైలెంట్ - తర్వాత ఏం చేయబోతున్నారు?
Nepal Flash Floods: నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
Hybrid Cyber Fraud: వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chilakaluripet Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
GV Narayanarao : సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
YSRCP North Andhra Leaders: వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
Nepal Flash Floods: నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
Toxic First Day Collection : టాక్సిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ - నెగిటివ్ టాక్ వచ్చినా హౌస్ ఫుల్
టాక్సిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ - నెగిటివ్ టాక్ వచ్చినా హౌస్ ఫుల్
YS Jagan Unanimous Elections Stand: అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు - ఇప్పుడు మాత్రం నో - జగన్ స్ట్రాటజీ వెనుక లెక్కలేంటి?
అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు - ఇప్పుడు మాత్రం నో - జగన్ స్ట్రాటజీ వెనుక లెక్కలేంటి?
Vijay TVK Parandur Airport:తమిళనాడులో పరంధూర్ ఎయిర్‌పోర్ట్ రద్దు - విజయ్ పాపులిస్ట్ మార్క్.. జగన్ పాలనతో ఎందుకు పోలుస్తున్నారు?
తమిళనాడులో పరంధూర్ ఎయిర్‌పోర్ట్ రద్దు - విజయ్ పాపులిస్ట్ మార్క్.. జగన్ పాలనతో ఎందుకు పోలుస్తున్నారు?
Fact Check: రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు ఉచిత మొబైల్ రీఛార్జ్ స్కీమ్‌ను ప్రధాని మోదీ ప్రకటించారా?
రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు ఉచిత మొబైల్ రీఛార్జ్ స్కీమ్‌ను ప్రధాని మోదీ ప్రకటించారా?
Embed widget