KTR on Revanth: రేవంత్ రెడ్డి ప్రవర్తనపై కేటీఆర్ ఆగ్రహం! స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్
KTR News: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం అధునాతన సేఫ్టీ మోకులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తీరుపై కేటీఆర్ అభ్యంతరం తెలిపారు.
Telangana News: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లష్కర్‌గూడలో కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాటి చెట్టు పైనుంచి పడి ప్రతి సంవత్సరం ఎంతో మంది కల్లుగీత కార్మికులు చనిపోతున్నందున వాటి నివారణకు అధునాతన సేఫ్టీ మోకులను ప్రభుత్వం రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కల్లు గీత కార్మికులను కొన్ని ప్రశ్నలు వేశారు. రోజూ ఎంత కల్లు వస్తుంది? అందులో ఎన్ని నీళ్లు కలుపుతారు? నీళ్లు కలిపితే గుర్తు పడతారా? అంటూ ప్రశ్నలు వేశారు. ఇలా రేవంత్ రెడ్డి అడిగిన తీరుపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.
‘‘మానవత్వం ఉన్న నాయకుడెవరూ ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడడు! గౌడన్నలను ఆ చెట్ల మీద అంతంతసేపు నిలబెట్టి, వారి వృత్తి మీద చౌకబారు జోకులు వేస్తూ, దాన్ని ప్రచారానికి వాడుకోవడం అమానవీయం, దుర్మార్గం! మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే ప్రచారం పీక్‌లో ఉంటుంది. అని మీ మతిలేని చర్యలు చూసి తెలంగాణ ప్రజలకు అర్థమవుతోంది’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మానవత్వం ఉన్న నాయకుడెవరూ ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడడు!
— KTR (@KTRBRS) July 15, 2024
గౌడన్నలను ఆ చెట్ల మీద అంతంతసేపు నిలబెట్టి, వారి వృత్తి మీద చౌకబారు జోకులు వేస్తూ, దాన్ని ప్రచారానికి వాడుకోవడం అమానవీయం, దుర్మార్గం!
మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే
ప్రచారం పీక్‌లో ఉంటుంది
అని మీ మతిలేని చర్యలు చూసి
తెలంగాణ… pic.twitter.com/EqD06spjhJ
కాంగ్రెస్ పార్టీ కౌంటర్
‘‘కేటీఆర్ దీన్నేమంటారు..? నాడు మీరు గౌడన్నలకు సరైన రక్షణ కిట్లు ఇవ్వకుండానే గంటల కొద్దీ తాటి చెట్లపై నిల్చోబెట్టి మీ పబ్లిసిటీ కోసం షూటింగ్ లు చేయించారు. ట్విట్టర్ టిల్లు సమాధానం చెపితే బాగుంటుంది’’ అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది.
కేటీఆర్ దీన్నేమంటారు...
— Telangana Congress (@INCTelangana) July 15, 2024
నాడు మీరు గౌడన్నలకు సరైన రక్షణ కిట్లు ఇవ్వకుండా నే గంటల కొద్దీ తాటి చెట్ల పై నిల్చోబెట్టి మీ పబ్లిసిటీ కోసం షూటింగ్ లు చేయించారు. ట్విట్టర్ టిల్లు సమాధానం చెపితే బాగుంటుంది. pic.twitter.com/JTcyv7CmdF
గౌడన్నలకు రక్షణ కిట్లు ఏంటి?
తాటి చెట్టు పైనుంచి కల్లు గీత కార్మికులు పడిపోకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని మోకులను చేయించింది. ఇవి అధునాతన సేఫ్టీ మోకులుగా ప్రభుత్వం చెబుతోంది. బీసీ సంక్షేమశాఖకు బాధ్యతలు అప్పగించగా.. దాదాపు రూ.8 కోట్లుతో ఈ కిట్లను తయారు చేయించారు. బీసీ సంక్షేమశాఖ ఆ బాధ్యత ను ఓ ఏజెన్సీకి అప్పగించింది. ఐఐటీ హైదరాబాద్ సహకారంతో ఆ ఏజెన్సీ ఈ సేఫ్టీ మోకులను రూపొందించింది.
అయితే, ఈ సేఫ్టీ మోకులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తయారు చేయించామని.. ఎన్నికల కోడ్ కారణంగా అప్పట్లో పంపిణీ చేయలేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు ‘కాటమయ్య రక్షణ కిట్లు’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కిట్లనే పంపిణీ చేస్తుందని తెలిపారు.