అన్వేషించండి

JaggaReddy : క్షమాపణ చెప్పిన జగ్గారెడ్డి - టీ కాంగ్రెస్‌లో సద్దుమణిగిన వివాదం

రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన జగ్గారెడ్డి ఒక్క రోజులోనే సారీ చెప్పారు. తప్పయిపోయిందన్నారు. మరోసారి అలాంటి తప్పు చేయనన్నారు.


తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేసినంతగా ఆవేశపడిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన తప్పు తెలుసుకున్నట్లుగా ప్రకటించారు. తాను అలా మాట్లాడటం తప్పేనని పార్టీకి సారీ చెప్పానని ప్రకటించారు. అంతా తన తప్పేనని రేవంత్ రెడ్డి తప్పేమి లేదని ప్రెస్‌మీట్ పెట్టి వివరించారు. పార్టీ అంతర్గత విషయాలు తాను మీడియా ముందు మాట్లాడి తప్పు చేశానని.. మరోసారి అలాంటి తప్పు జరగనీయనని హమీ ఇచ్చారు. తనకు రేవంత్ రెడ్డి సోదరుడు లాంటివాడన్నారు. టీఆర్ఎస్, బీజేపీలపై పోరాడటమే తమ విధి అని..  రాహుల్, సోనియా డైరక్షన్‌లో పని చేస్తానని వివరణ ఇచ్చారు.  

Also Read : కరోనా మరణాలకు పరిహారం ! లెక్కల్లో వేయని వారి కుటుంబాలు అన్యాయమైపోయినట్లేనా..!?

 అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. రేవంత్ రెడ్డి హీరోయిజం కాంగ్రెస్‌లో చెల్లదన్నారు. తనకు సమాచారం ఉండటం లేదని.. తనకు రేవంత్ కు గొడవలు ఉన్నాయని చెప్పాలనుకుంటున్నారని మండిపడ్డారు. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు హైకమాండ్‌కు కూడా చేరాయి. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ గాంధీభవన్‌లో సమావేశం అయింది. ఇందులో పాల్గొనేందుకు పార్టీ ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ కూడా వచ్చారు. 

Also Read : ఒకటే ఫోటో .. కేటీఆర్, విజయసాయిరెడ్డి ప్రచారం ! ఇంతకీ ఎవరిది ఫేక్ ?

జగ్గారెడ్డి వ్యాఖ్యలపై సమావేశంలో చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. జగ్గారెడ్డి తీరును మల్లు రవి తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది. అయితే జగ్గారెడ్డి తనను అడగడానికి మల్లు రవి ఎవరని ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. అయితే అదే సమయంలో జగ్గారెడ్డి పార్టీ వ్యవహారాలను మీడియా ముందు మాట్లాడి క్రమశిక్షణ ఉల్లంఘించారని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అధిష్టానం కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లుగా గాంధీ భవన్‌లో ప్రచారం జరుగుతోంది. దీంతో చివరికి జగ్గారెడ్డి పరిస్థితులకు తగ్గట్లుగా తగ్గిపోయారు. వెంటనే తప్పయిపోయిందని ఒప్పుకున్నారు. అయితే జగ్గారెడ్డి గౌరవాన్ని కాపాడేందుకు పార్టీ నేత మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నించారు. ఆయనపై హైకమాండ్ ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేయలేదని ..కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సమస్య వచ్చిందన్నారు. 

Also Read : తెలంగాణలోనూ ప్రభుత్వ మటన్ మార్టులు.. హోల్ సేల్ అండ్ రీటైల్ !

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కొంత మంది సీనియర్లు ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేరు. వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు. ఉత్తమ్‌కు సన్నిహితుడైన జగ్గారెడ్డి వారి తరపున తరచూ రేవంత్ రెడ్డిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నార్న అభిప్రాయం ఆ పార్టీలో ఉంది. అయితే గతంలోలా ఇప్పుడు లేదని ఎవరైనా పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని జగ్గారెడ్డి ఇష్యూ ద్వారా పార్టీ హైకమాండ్ స్పష్టమైన సంకేతాలు పంపిందని అంటున్నారు.

Also Read : ఏ పథకానికీ లేని చట్టబద్ధత ‘దళిత బంధు’కు ఎందుకు? గతంలో చట్టబద్ధత కల్పించిన "బంగారు తల్లి" ఏమయింది ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
Konda Surekha Apology To KTR: కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు - సారీ వెనుక ఘర్ వాపసీ స్కెచ్ ఉందా?
కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు - సారీ వెనుక ఘర్ వాపసీ స్కెచ్ ఉందా?
Miyapur Lands Case Supreme Court: మియాపూర్ భూముల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ విక్టరీ - 550 ఎకరాలు సర్కార్‌వే!
మియాపూర్ భూముల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ విక్టరీ - 550 ఎకరాలు సర్కార్‌వే!
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
Bigg Boss Season 10 Today October 29th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
Gill Temple Gadget: నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Embed widget