అన్వేషించండి

Dalita Bandhu: ఏ పథకానికీ లేని చట్టబద్ధత ‘దళిత బంధు’కు ఎందుకు? గతంలో చట్టబద్ధత కల్పించిన "బంగారు తల్లి" ఏమయింది ?

"దళిత బంధు" పథకానికి చట్టబద్ధత కల్పించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏ పథకానికి లేని చట్టబద్ధత ఎందుకు ? గతంలో చట్టబద్ధత కల్పించిన "బంగారుతల్లి" పథకం ఇప్పుడు ఎందుకు లేదు ?

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా "దళిత బంధు" పథకాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఆ పథకానికి చట్టబద్ధత కల్పించేందుకు నిర్ణయించింది. ఏ పథకానికీ చట్టబద్ధత కల్పించాలన్న ఆలోచన ప్రభుత్వం ఇప్పటి వరకూ చేయలేదు. చివరికి రైతు బంధు పథకానికి కూడా కల్పించలేదు. కానీ దళిత బంధుకు మాత్రం చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లోనే ఆ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే ఈ చట్టబద్ధత వల్ల ఏంటి ఉపయోగం అనే చర్చ సహజంగానే అందరికీ వస్తోంది. 

చట్టబద్ధత వల్ల నిధులకు భరోసా! 

పథకానికి చట్టబద్ధత కల్పించడం వల్ల పథకానికి ప్రతి ఏటావిధిగా నిధుల కేటాయింపు జరపాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత ఉంది. ఈ ప్లాన్‌కు ప్రభుత్వం బడ్జెట్‌లో విడిగా నిధులు కేటాయిస్తుంది. చట్టబద్ధత కల్పించడానికి కారణం బడ్జెట్‌లో కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా ఉండటం. ఏ అవసరాల కోసం నిధులను కేటాయించిందో వాటిని అందుకోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ నిధులను వినియోగించని పక్షంలో వాటిని ఇతర అవసరాలకు మళ్లించడానికి వీలు ఉండదు. మరుసటి సంవత్సరానికి ప్రభుత్వం చేసే కేటాయింపులకు జమ అవుతాయి. సబ్ ప్లాన్ నిధులు వారి కోసమే ఖర్చు చేయాలి. చేయకపోతే ఆ నిధులు వచ్చే  ఏడాదికి జమ అవుతాయి కానీ మురిగిపోవు.

Also Read : ఖమ్మంలో అమానవీయం.. చితిపై కూర్చొని నిరసన, అంత్యక్రియలు వద్దని స్థానికుల డిమాండ్
Dalita Bandhu: ఏ పథకానికీ లేని చట్టబద్ధత ‘దళిత బంధు’కు ఎందుకు? గతంలో చట్టబద్ధత కల్పించిన

చట్టబద్ధత వల్ల దళిత బంధుకు విడిగా వ్యవస్థ.. నిధులు !

ప్రతీ ఏటా బడ్జెట్‌లో వివిధ పథకాలకు నిధులు కేటాయిస్తున్న తరహాలోనే దళిత బంధుకు విడిగా నిధులు కేటాయిస్తారు.  ఇప్పటి వరకు ఎస్సీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ పథకానికి నిధులను విడుదల చేశారు. చట్టబద్ధత కల్పించిన తర్వాత ప్రత్యేకంగా దళిత బంధు కార్పొరేషన్ ద్వారానే విడుదలవుతాయి. బడ్జెట్‌లో దళిత బంధుకు కేటాయించిన నిధులు ఆ పథకానికి మాత్రమే వెచ్చిస్తారు. దారి మళ్లించడానికి ఉండదు.  ఆ నిధులను వినియోగించపోతే.. తర్వాత ఏడాది దళిత బంధు లబ్దిదారులకు అందిస్తారు. ఆ ఏడాది కేటాయించే నిధులు అదనం. అంటే దళిత బంధుకు బడ్జెట్లో కేటాయించే నిధులు సంపూర్ణంగా ఆ పథకం లబ్దిదారులకే లభిస్తాయి. Also Read : కొండా మురళి, సురేఖల బయోపిక్‌పై ఆర్జీవీ గురి ! మళ్లీ వివాదం తప్పదా ?
Dalita Bandhu: ఏ పథకానికీ లేని చట్టబద్ధత ‘దళిత బంధు’కు ఎందుకు? గతంలో చట్టబద్ధత కల్పించిన

గతంలో "బంగారు తల్లి" పథకానికి చట్టబద్ధత !

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు "బంగారు తల్లి" అనే పథకానికి చట్టబద్ధత కల్పించారు.  బాలికలపై వివక్ష, భ్రూణ హత్యలను నివారించి బాలికాభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో  బంగారు తల్లి పథకాన్ని తెచ్చింది. 2013 జూలైలో చట్టబద్ధత కల్పిస్తూ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. 2013 మే నుంచి పుట్టిన ప్రతి ఆడబిడ్డకూ ఈ పథకం వర్తించేలా చట్టం చేశారు.  ఈ పథకంలో ఆడపిల్ల పుట్టిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూ.2500 వారి ఖాతాలో జమ చేస్తారు. ఆ తర్వాత విడతల వారీగా ప్రతి ఏటా ఆడపిల్ల చదువుకు నిధులు కేటాయించాలనేది దీని లక్ష్యం. మొత్తం రెండు లక్షల 16వేల రూపాయలు బంగారుతల్లి పథకం కింద లబ్ధి చేకూరేలా పథకం తయారైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అప్పటి సీఎం చట్టబద్ధత కల్పించి ప్రారంభించారు.

Also Read : పేపర్ ఏస్తే తప్పేంటి.. కష్టపడితేనే ఫ్యూచర్ సూపరుంటది.. పేపర్ బాయ్ మాటలకు కేటీఆర్ ఫిదా
Dalita Bandhu: ఏ పథకానికీ లేని చట్టబద్ధత ‘దళిత బంధు’కు ఎందుకు? గతంలో చట్టబద్ధత కల్పించిన

2014లో రాష్ట్ర విభజన తర్వాత అమలు కాని "బంగారు తల్లి"

రాష్ట్ర విభజన జరగడంతో బంగారు తల్లి లాంటి చట్టబద్ధత ఉన్న పథకాలు కూడా కొర గాకుండా  పోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఆపథకాన్ని కొనసాగించడానికి ఇష్టపడలేదు. ఇక్కడ చట్టబద్ధత అనేది ప్రభుత్వానికి పెద్దగా అడ్డంకి కాలేకపోయింది. ఇటు ఏపీ.. అటు తెలంగాణ రెండు ప్రభుత్వాలు పథకం అమలును మొదటినుంచి నిలిపవేశాయి. 2016 జూన్‌లో తెలంగాణ అధికారికంగా బంగారుతల్లి పథకాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆరోగ్యలక్ష్మి వంటి పథకాల కింద ఆడపిల్లల కోసం ఇప్పటికే కోట్లు ఖర్చు చేస్తున్నామన్న ఇక బంగారు తల్లి పథకం అవసరం లేదని తేల్చేసింది. ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిందో లేదో స్పష్టత లేదు కానీ పథకం మాత్రం అమలు కావడం లేదు.

Also Read : హైద‌రాబాద్ నగర అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ కీల‌క ప్రక‌ట‌న‌.. 31 ప్రాంతాల్లో ఎస్‌టీపీల ఏర్పాటు...
Dalita Bandhu: ఏ పథకానికీ లేని చట్టబద్ధత ‘దళిత బంధు’కు ఎందుకు? గతంలో చట్టబద్ధత కల్పించిన

ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటేనే చట్టబద్ధత కల్పించినా పథకం అమలు !

పథకాలకు చట్టబద్ధత కల్పించినప్పటికీ ప్రభుత్వాలు అనుకుంటే మాత్రమే అమలు చేస్తారని బంగారు తల్లి పథకం ద్వారా సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఎంత సులువుగా చట్టబద్ధత చేయగలరో అంత సులువుగా ఉపసంహరించుకోవచ్చు కూడా. అలాగే నిధుల కేటాయింపు విషయంలోనూ అంతే. అయితే చట్టబద్ధత కల్పించడం ద్వారా తాము నిజాయితీగా పథకాన్ని అమలు చేస్తామని ప్రజలకు నమ్మకం కలిగించవచ్చు. అందుకోసమే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధత ఆలోచన చేస్తోందని భావించవచ్చు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget