Khammam: ఖమ్మంలో అమానవీయం.. చితిపై కూర్చొని నిరసన, అంత్యక్రియలు వద్దని స్థానికుల డిమాండ్
ఖమ్మం జిల్లాలోని వేంసూరు ప్రాంతంలో ఈ అమానుష సంఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దహన సంస్కారాలను వారు కాలనీల వద్ద ఇళ్ల సమీపంలో చేస్తున్నారంటూ ఆరోపించారు.
![Khammam: ఖమ్మంలో అమానవీయం.. చితిపై కూర్చొని నిరసన, అంత్యక్రియలు వద్దని స్థానికుల డిమాండ్ Khammam: Locals stops Cremation arrangments after sitting on Firewood in Vemsoor Khammam: ఖమ్మంలో అమానవీయం.. చితిపై కూర్చొని నిరసన, అంత్యక్రియలు వద్దని స్థానికుల డిమాండ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/24/2d1493d513a5fdec49a64874e51de5ef_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఖమ్మంలో అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. ఇది స్థానికంగా చర్చనీయాంశం అయింది. చనిపోయిన ఓ వ్యక్తి మృత దేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తుండగా వారు ఊహించని షాక్ ఎదురైంది. స్థానికులు అంత్యక్రియలు జరిపే స్థలం వద్దకు వచ్చి వాటిని ఆపేయాలని డిమాండ్ చేశారు. అయినా కుటుంబ సభ్యులు వినకపోవడంతో వారు ఆందోళనను మరింత తీవ్రం చేశారు. ఏకంగా శవాన్ని కాల్చేందుకు ఏర్పాటు చేసిన చితిపై కూర్చొని ఓ వ్యక్తి.. అక్కడ అంత్యక్రియలు జరపొద్దంటూ భీష్మించుకొని కూర్చున్నాడు. చివరి క్రియలు జరపొద్దని ఇలా అడ్డుపడడం స్థానికంగా చర్చనీయాంశం అయింది.
ఖమ్మం జిల్లాలోని వేంసూరు ప్రాంతంలో ఈ అమానుష సంఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దహన సంస్కారాలను వారు కాలనీల వద్ద ఇళ్ల సమీపంలో చేస్తున్నారంటూ ఆరోపించారు. అందుకే తమ ఇళ్ల వద్ద అలాంటి దహన సంస్కారాలు వద్దని తాము ఆందోళన చేసినట్లుగా స్థానికులు చెప్పారు. అయితే, మరీ దారుణంగా చితిపై కూర్చుని నిరసన వ్యక్తం చేయడం మాత్రం సంచలనంగా మారింది.
ఖమ్మం జిల్లా వేంసూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో అంత్యక్రియలు జరిపేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొద్దికాలంగా కాలనీ సమీపంలోనే మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం ఆ తర్వాత మరోచోట ప్రభుత్వం వైకుంఠధామాన్ని నిర్మించింది. అయినా కానీ, గురువారం ఓ వ్యక్తి మృతి చెందగా ఆ మృత దేహానికి కాలనీ సమీపంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు తీసుకొని వెళ్లారు.
Also Read: Weather Updates: బంగాళాఖాతంలో నేడు మరో అల్ప పీడనం.. ఏపీ, తెలంగాణలో వర్షాలు ఇలా..
ఇదంతా చూసిన కాలనీ వాసులు మూకుమ్మడిగా వెళ్లి వారిని అడ్డుకున్నారు. వారు అప్పటికే చితి పేర్చడం చేసేసినా అంత్యక్రియలు జరపడానికి వీల్లేదంటూ డిమాండ్ చేశారు. అక్కడ జరిగే దహన సంస్కారాలతో తాము ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నామంటూ వాపోయారు. మృతదేహాన్ని తీసుకొస్తుండగా అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అప్పటికే సిద్ధం చేసిన చితిపై కూర్చుని నిరసన తెలిపారు. చివరకు మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు.. కాలనీ వాసులతో మాట్లాడి నచ్చచెప్పగా చివరికి ఆ ఒక్క అంత్యక్రియలకు అతి కష్టంపై ఒప్పుకున్నారు. కాలనీ వాసులు దహన సంస్కారాలకు ఒప్పుకోవడంతో ఆఖరికి వివాదం సద్దుమణిగింది.
Watch: Watch: అసలు పిడుగులు ఎందుకు పడతాయి.? పిడుగుపాటుకు కారణమయ్యే సైన్స్ ఏంటి?
Also Read: RGV : కొండా మురళి, సురేఖల బయోపిక్‌పై ఆర్జీవీ గురి ! మళ్లీ వివాదం తప్పదా ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)