TSRTC Special Busses: జస్ట్ కాల్ చేస్తే చాలు.. మీ ఇంటికే ఆర్టీసీ బస్సు.. కానీ ఒక్క షరతు
సంక్రాంతి ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. 30 మంది మీ ఏరియాలో ఉండి.. జస్ట్ కాల్ చేస్తే.. మీ ఇంటికే డైరెక్ట్ గా ఆర్టీసీ బస్సు వస్తుంది.
సంక్రాంతి పండగ వచ్చేసింది. పట్టణాల్లోని వారంతా పల్లెలకు పయనమవుతున్నారు. మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణికుల దగ్గర ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. బస్ స్టాప్ కి వెళ్లి.. ప్రయాణించాలంటే.. ఒకటే రద్దీ. ఇలా ఫీల్ అయ్యేవారి కోసం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
పండగ కోసం ఇంటికి వెళ్లే వారి కోసం.. టీఎస్ఆర్టీసీ మరో కొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల దగ్గరికే ఆర్టీసీ బస్సు వెళ్లనుంది. దీనికి సంబంధించి సమన్వయం చేసుకునేందుకు.. ఆర్టీసీ అధికారుల నంబర్లను సైతం ట్విట్టర్ లో పోస్టు చేశారు. అయితే సొంత ఊరికి నేరుగా బస్సులో వెళ్లాలనుకునేవారు.. ఆ నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడాలి. కానీ ముప్పై మంది ప్రయాణికులు తప్పనిసరిగా ఉండాలి. అలా ఉంటేనే మీ వద్దకు బస్సు వస్తుంది.
ప్రయాణిక దేవుళ్ళందరికి మంగిడీలు!! అదనపు ఛార్జీలు లేవు. వివరాలకు MGBS: 9959226257, JBS: 9959226246 నెంబర్ లపై సంప్రదించండి #ChooseTSRTC @TSRTCHQ @puvvada_ajay @Govardhan_MLA @TV9Telugu @eenadulivenews @sakshinews @DDYadagiri @airnews_hyd @Telugu360 #Sankranthi2022 #mondaythoughts pic.twitter.com/U3yLyvyacv
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 10, 2022
ఒకే ఊరికి దగ్గరలో ఉన్నవాళ్లకు ఇది ఎంతో ఉపయోగకరం. సిటీలోని కాలనీ వాసులతో పాటు , ఆయా ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు, కార్మికులకు ప్రయాణం సులభం అవనుంది. జిల్లాల వారిగానూ ఉపయోగం ఉంటుంది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. ఇలా ఒకే ఏరియాకు సంబంధించిన వారు.. 30 మంది ఉంటే.. ఆర్టీసీ బస్ బుక్ చేసుకుని వెళ్లొచ్చు.
ప్రత్యేక బస్సులు
సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం 4,360 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ చెప్పింది. అయితే ప్రత్యేక బస్సుల్లో 590 బస్సులకు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం, విజయవాడ, నెల్లూరు, గంటూరు, ఒంగోలు పట్టణాలతో పాటు.. కర్ణాటక, మహారాష్ట్రలకు బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. ఏ విధమైన అదనపు అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదని టీఎస్ఆర్టీసీ పేర్కొంది.