Kavitha: బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది- అణుబాంబు పేల్చిన కవిత
Kavitha: బీఆర్‌ఎస్ పార్టీలో మరోసారి సంచలనం సృష్టించారు ఎమ్మెల్సీ కవిత. బీజేపీలో విలీనం దిశగా అడుగులు పడుతున్నాయని తీవ్ర ఆరోపణలు చశారు

Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో బాంబు పేల్చారు. పార్టీలో ఉన్న విభేదాలను మరోసారి బయటపెట్టారు. బీఆర్‌ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే దిశగా కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే కనీసం నిరసన కూడా తెలపలేదని ధ్వజమెత్తారు.
ఈ ఉదయం మీడియాతో చిట్ చాట్ చేసిన కవిత... తాను కేసీఆర్ నాయకత్వం తప్ప వేరే ఎవరి నాయకత్వం కూడా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. తాను లీకు వీరులు గురించి బయటపెట్టమంటే గ్రీకు వీరులు వచ్చి దాడి చేస్తున్నారని అన్నారు. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లడిస్తున్నాని ధ్వజమెత్తారు. నా జోలికొస్తే బాగోదని హెచ్చరించారు. కేసీఆర్‌ను మేమే నడిపిస్తున్నామని కొందరు చెప్పుకుంటున్నారని అన్నపైనే డెరెక్ట్ అటాక్ చేశారు. కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లా మీరు అని ప్రశ్నించారు. నా లేఖ లీక్ చేసిందెవరో చెప్పాలని మరోసారి డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే ఎందుకు నిరసనలు తెలపలేదన్నారు. ఇంకో నేతకు నోటీసులు ఇస్తే ఎందుకు హంగామా చేశారని ప్రశ్నించారు. ఇక్కడ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చిన వెంటనే కొందరు విమర్శలు చేయడంపై ఆమె స్పందించారు.
పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరుపున తాను చేస్తున్నట్టు వెల్లడించారు కవిత. బిఆర్‌ఎస్‌ను బీజెపిలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై పడి ఏడిస్తే ఏమోస్తుందన్నారు కవిత. వాళ్లలా చిచోరా రాజకీయాలు చేయబోనని అన్నారు కవిత. హుందాగా ఉంటానని అన్నారు. కోవర్టులు ఉన్నప్పుడు ఎందుకు పక్కనపెట్టడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని...పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించబోనని స్పష్టం చేశారు. కేసీఆర్‌కి తనకు మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తనను కేసీఆర్ నుంచి దూరం చేస్తే ఎవరి లాభమో అందరికీ తెలుసని అన్నారు. కావాలనే ఎంపీ ఎన్నికల్లో ఓడించారని కవిత అన్నారు.
కాంగ్రెస్‌పై కూడా కవిత విమర్శలు చేశారు. కాంగ్రెస్ మునిగిపోయే నావగా అభివర్ణించారు. ఆ పార్టీతో రాయబారాలు నాకెందుకని ప్రశ్నించారు. నాపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించడంలేదని నిలదీశారు. తనది బిఆర్ ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు.
నేను జైలులో ఉన్నప్పుడే తనపై కుట్ర జరిగిందని మరో ఆరోపణ చేశారు కవిత. జైలుకు వెళ్లేటప్పుడు పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పినట్టు వెల్లడించారు. పార్టీ సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేశారన్నారు.





















