అన్వేషించండి

Kavitha Party : తెలంగాణలో కొత్త పార్టీ రానుందా? ఆ శక్తియుక్తులు కవితకు ఉన్నాయా? ఆమెకున్న ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?

Kavitha Party : కేసీఆర్ లాంటి లెంజడరీ నాయకుడ్ని, కేటీఆర్, హరీశ్ రావు లాంటి రాజకీయ చతురత ఉన్న నేతలను కాదని కవిత రాజీకీయ భవిష్యత్తు కోసం పార్టీ పెట్టగలరా? ఇంతకీ ఆమెకున్న బలాబలాలేంటీ?

Kavitha Party : కల్వకుంట్ల కవిత. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. తెలంగాణలో ఇక చెప్పనక్కరలేదు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరికీ కవితకు ఉద్యమ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలతో ఉన్న సంబంధాలు తెలుసు. అయితే  మైడియర్ డాడీ అంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ ఇప్పుడు సంచనలమైంది. బీఆర్ఎస్ పార్టీ చీలుతుందా అన్న చర్చ దగ్గరి నుంచి కవిత కొత్త పార్టీ పెట్టేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొట్టే స్థాయికి చేరాయి. అయితే  బీఆర్ఎస్ లో ఏదో జరుగుతుందన్నది మాత్రం ఆమె లేఖ ద్వారానే బహిర్గతమైంది. అయితే ఇప్పటి వరకు దీనిపై  పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ నర్మగర్భంగా మాట్లాడటం మినహా  అందరూ సైలంట్ గా ఉన్నారు. ఈ అంశాలపై చర్చించేందుకు కేసీఆర్ నుంచి కవితకు  ఎలాంటి పిలుపు రాలేదు. అయితే కేసీఆర్ దూతలుగా రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, పార్టీ లీగల్ సెల్ ఇంఛార్జి గండ్ర మోహన్ రావు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో తన లేఖను బయటపెట్టిన వ్యక్తులెవరో తెల్చాలని, తన రాజకీయ భవిష్యత్తుపై హమీ ఏంటని, పార్టీలో తన స్థానం ఏంటని  కవిత ప్రశ్నించినట్లు  తెలిసింది.  కేసీఆర్‌తో నేరుగా చర్చించాలని తాను అనుకుంటున్నట్లు వారితో కవిత చెప్పినట్లు సమాచారం.  రానున్న రోజుల్లో దీనిపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారు. ఒక వేళ ఈ విషయంలో ఆయన మౌనం దాల్చితే కవిత ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పడే చేప్పలేం. అయితే  ఒక వేళ ఈ చర్చలు విఫలమై కవిత పార్టీ పెడితే ఎలా ఉంటుంది? అసలు పార్టీ పెట్టే శక్తి కవితకు ఉందా?  తెలంగాణలో కొత్త పార్టీకి అవకాశం ఉందా ?  కవిత కొత్త పార్టీ పెడితే  ఏ పార్టీ నష్టపోతుంది ? అన్న అంశాలు చూద్దాం.

కొత్త పార్టీ పెట్టే శక్తి యుక్తులు కవితకు ఉన్నాయా ?

తెలంగాణలో కేసీఆర్ కుమార్తెగా ప్రజలకు పరిచయం అయిన కవిత ఆ తర్వాత కాలంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అటు ఉద్యమంలో, ఇటు రాజకీయాల్లో తనకుంటూ ఓ స్థానం ఏర్పాటు చేసుకున్నారు. 

కవిత ప్లస్ పాయింట్స్ ఏంటంటే…?

  • KCR కూతురు - తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కూతురుగా ప్రజల్లో మంచి గుర్తింపు  ఉంది.  అదే రీతిలో పార్టీలో కేసీఆర్ తర్వాత  కేటీఆర్, హరీశ్ రావుకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అలాంటి ఫాలోయింగ్ ను కవిత సంపాదించుకున్నారు. కొత్తగా తనను తాను తెలంగాణ ప్రజలకు పరిచయం చేసుకోనక్కరలేని మంచి అవకాశం కవితకు ఉంది.

 

  • కవిత ఉద్యమ ప్రస్థానం -  ఇది ఓ పార్టీ పెట్టడానికి మంచి బలాన్ని ఇచ్చే అంశంగా చెప్పవచ్చు.  తెలంగాణ ఉద్యమంలో కవిత పాత్రకు మంచి గుర్తింపు ఉంది.  తెలంగాణ జాగృతి వంటి సంస్థను స్థాపించి, ఆ సంస్థతో తెలంగాణ భాష, సంస్కృతి, పండుగల పట్ల ప్రజల్లో ఓ చైతన్యాన్ని తీసుకురావడంలో సఫలీకృతం అయ్యారు. ఈ సంస్థ ద్వారా తెలంగాణ ప్రజలో ఓ సంబంధాన్ని ఏర్పరుచుకోగలిగారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఈ సెంటిమెంట్ ఏదో రూపంలో  ఉపయోగపడుతుంది. కవిత కొత్త పార్టీ పెడితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తీరు, ఉద్యమ కేసుల్లో ఉండంటం వంటి అంశాలు ప్రజలను దగ్గర చేసేందుకు  ఉపయోగపడతాయి. పార్టీ ప్రారంభానికి ఇది ఓ  ఉత్ప్రేరకంగా ఉపయోగపడే అవకాశం ఉంది.

 

  • తెలంగాణ జాగృతి సంస్థ -  కవిత ఇప్పటికే అధ్యక్షురాలిగా ఉన్న తెలంగాణ జాగృతి సంస్థ కొత్త పార్టీ  ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.  ఇప్పటికే తెలంగాణలోని గ్రామ స్థాయి వరకు తెలంగాణ జాగృతి సంస్థను కవిత విస్తరింప జేశారు. జాగృతి కార్యకర్తలు తెలంగాణ అంతటా ఉన్నారు.  ఇతర రాష్ట్రాల్లోను, విదేశాల్లోను జాగృతి శాఖలు ఉన్నాయి. కొత్త పార్టీ పెట్టేందుకు ఈ బేస్ కవితకు బాగా లాభిస్తుంది. కొత్తగా పార్టీ ఏర్పాటు చేసే లాంఛింగ్ సమస్యలు ఏవీ కవితకు వచ్చే అవకాశం లేదు. ఇలా తెలంగాణ జాగృతి సంస్థ కొత్త పార్టీ ఏర్పాటుకు లాంఛింగ్ పాడ్ లా ఉపయోగపడుతుంది.

 

  • ప్రజాకర్షణ ఉన్న మహిళా నేత కవిత -  తెలంగాణలో ప్రజాకర్షణ గల మహిళా రాజకీయ నాయకుల కొరత ఉంది. మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకునే శక్తి ఉన్న మహిళా నేతలు తెలంగాణలో లేరనే చెప్పాలి. ఈ లోటును కవిత పూడ్చే అవకాశం ఉంది. మహిళలను ఆకట్టుకునే నాయకురాలిగా ఎదిగే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ జాగృతి సంస్థ, మహిళా రిజర్వేషన్లపై చేసిన కార్యక్రమాలు, కవితకు ఉన్న రాజకీయ అనుభవం కొత్త పార్టీ పెట్టేందుకు కలిసి రావచ్చు. ఉద్యమ నాయకురాలిగా, పార్లమెంట్ సభ్యురాలిగా, శాసనమండలి సభ్యురాలిగా ఉన్న అనుభవం పార్టీ నడపడంలో కొంత  బలాన్ని ఇస్తుంది. అంతే కాకుండా కేసీఆర్ కూతరు కావడంతో తన తండ్రి పార్టీని నడిపిన తీరు, సంక్షోభ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు వాటి వల్ల వచ్చిన విజయాలు, ఓటములు దగ్గర నుంచి చూసిన అనుభవం కూడా కలిసి వస్తుంది.

 

  • ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా -  కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల పట్ల విముఖత ఉన్న  నాయకులు, కార్యకర్తలు, ప్రజలు  ఓ కొత్త ప్రత్యామ్నాయాన్ని చూస్తుంటారు.  అలాంటి సందర్భంలో కవిత పెట్టే పార్టీకి  ఈ రాజకీయ పరిస్థితులు కొంత మేర కలిసి రావచ్చు. అలాంటి నేతలు కొత్త పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది.  ఇలాంటి చేరికలు కొత్త పార్టీలో జోష్ నింపుతుందనడంలో సందేహం లేదు.

 

కొత్త పార్టీ పెట్టేందుకు ప్రతికూల అంశాలు ఏంటంటే

  • కుటుంబ రాజకీయాలనేస్టాంప్ -  తెలంగాణలో ఇప్పటికే కేసీఆర్ కుటుంబపై  ఉన్న ప్రధాన ఆరోపణ కుటుంబ రాజకీయాలు అనే ముద్ర. బీఆర్ఎస్ నుంచి వీడి కొత్త పార్టీ పెట్టినా కవితకు ఆ ముద్ర తప్పదు.  అటు విపక్షాలు, ప్రజల నుంచి వచ్చే రాజకీయ విమర్శలు  కొత్త పార్టీ పెట్టే విషయంలో ప్రతికూలం కావచ్చు.

 

  • లిక్కర్ స్కాం ఆరోపణలు -  లిక్కర్ స్కాంలో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలతో  కవిత జైలుకు వెళ్లి రావడం ప్రధాన ప్రతికూలాంశంగా మారవచ్చు. అయితే కేసు నుంచి కవిత బయటపడే వరకు విపక్షాలు కవితను రాజకీయంగా వెనక్కు నెట్టే అస్త్రంగా లిక్కర్ స్కాం కేసును ఉపయోగిస్తాయనడంలో సందేహం లేదు. కొత్త పార్టీ పెట్టే వ్యక్తి రాజకీయ జీవితం మచ్చ లేనిదిగా ఉంటేనే పార్టీ నడపటం కష్టమైన ప్రస్తుత రాజకీయాల్లో లిక్కర్ స్కాంలో ఆరోపణలతో పార్టీని పెట్టి దాన్ని నడపడం కవితకు కత్తిమీద సామే అని చెప్పాలి.

 

  • తెలంగాణ రాజకీయ వాతావరణం - ప్రస్తుత పరిస్థితుల్లో కవిత కొత్త పార్టీ పెట్టేందుకు తెలంగాణలో రాజకీయ వాతావరణం అనుకూలంగా లేదనే చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలో ఉండటం, బీజేపీ క్రమ క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ ఉన్న తరుణం ఇది. బీఆర్ఎస్ పార్టీ కూడా  భారీ బహిరంగ సభను వరంగల్ లో నిర్వహించి ప్రజాకర్షణ శక్తి  ఏ మాత్రం తమ చీఫ్ కేసీఆర్‌కు తగ్గలేదని నిరూపించుకుంది. ఈ ఉత్సాహంతో ముందుకు సాగుతుంది ఇలాంటి రాజకీయ వాతావరణంలో కవిత కొత్త పార్టీ పెడితే ప్రజల నుంచి అనుకున్న రీతిలో మద్ధత్తు వస్తుందని ధీమాగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.

 

  • బీఆర్ఎస్ కు దెబ్బ -  కవిత కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్‌కు నష్టం కలిగించడమే ప్రధాన లక్ష్యం అవుతుంది. ఆ పార్టీ ఓటర్లలోనే ఎక్కువ చీలిక వస్తుందన్నది నిజం. ఆ పార్టీలోని అసంతృప్త నేతలు, కార్యకర్తలు, ఓటర్లు కొద్ది మంది కవిత వైపు తిరగవచ్చు. కాని ఇది బీఆర్ఎస్‌కు, అటు కవితకు లాభం చేకూర్చేది కాకుండా కాంగ్రెస్, బీజేపీలకు లాభించే అవకాశం ఉంది.

 

  • పార్టీ ఏర్పాటుకు సూటైన లక్ష్యం -  ఏ పార్టీ స్థాపించినా దానికో లక్ష్యం ఉంటుంది.  అయితే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే కాంగ్రెస్ , బీజేపీ, బీఆర్ఎస్, వామపక్షాల వంటి పార్టీలు ఓ బలమైన కారణాలతో పురుడు పోసుకున్నవి . పక్క రాష్ట్రంలో తీసుకున్నాటీడీపీ , వైసీపీ ఆవిర్భావం వెనుక బలమైన ప్రజా లక్ష్యాలు ఉన్నాయి. అయితే కవిత పెట్టే కొత్త పార్టీ తనకు అన్యాయం జరిగిందని చెబితే ప్రజలు ఆమోదం తెలిపే స్థితిలో లేరు.  ఓ బలమైన ప్రజల ఆకాంక్షలను లక్ష్యంగా పెట్టుకొని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాంటి సెంటిమెంట్ ఉంటే తప్ప కొత్త పార్టీ నిలదొక్కుకునే పరిస్థితి ఉండదు.

 

  • నిధుల సమస్య - కొత్త రాజకీయ పార్టీ స్థాపన అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. నిధులు భారీగా అవసరం. కేసీఆర్ కుమార్తెగానో లేదా జాగృతి అధ్యక్షురాలిగానో నిధుల సేకరణ అంత సుళువుగా సాధ్యమయ్యే పని కాదు.  కొత్త నాయకులను, కార్యకర్తలను తన వైపు తిప్పుకోవడం కూడా అంత ఈజీగా జరిగే పని కాదు.

అయితే అసంతృప్తితో ఉన్న కవిత కొత్త పార్టీ పెడుతారా లేకుంటే టీ కప్పులో తుపాను లా బీఆర్ఎస్ లో ఈ సంక్షోభం ముగియనుందా? అన్నది వేచి చూడాల్సిందే. అయితే కొత్త పార్టీ స్థాపనకుపై అంశాలు ప్రభావితం చూపే అవకాశం మాత్రం ఉన్నాయి. కవిత కొత్త పార్టీ పెట్టడం అనేది మాత్రం సాహసోపేతమైన చర్యగా చూడాల్సిందే.  బీఆర్ఎస్‌లో డైనమిక్‌గానే కవిత వ్యవహార శైలి ఉంటుందని గులాబీ నేతలు చెబుతుంటారు. కేసీఆర్‌కు కవిత లేఖ రాయడం, ఆ లేఖ బహిర్గతం కాగానే సైలంట్‌గా ఉండకుండా తన లేఖను బయపెట్టింది కేసీఆర్ చుట్టు ఉన్న దయ్యాలే అని, కోవర్టులే అని మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడటం ఇవన్నీ కవిత ఓ కచ్చిత నిర్ణయానికి వచ్చి చేస్తున్న చర్యలుగానే చూడాల్సి వస్తుంది. పార్టీలో తన స్థానం ఏంటో తెలుసుకునేందుకు  ఈ రీతిలో కవిత స్పందన ఉందన్నది బీఆర్ఎస్ కీలక నేతల మాట. ఇనాళ్లు పార్టీలో ఉండి పని చేసిన తన లాంటి నేతను పక్కన పెడితే చూస్తూ తాను ఊర్కునే రకం కాదన్న హెచ్చరిక గత రెండు మూడు రోజుల పరిణామాలు చెబుతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే కేసీఆర్ లాంటి లెంజడరీ నాయకుడ్ని, కేటీఆర్, హరీశ్ రావు లాంటి రాజకీయ చతురత ఉన్న నేతలను కాదని కవిత తన రాజీకీయ భవిష్యత్తు కోసం  పార్టీ పెట్టి వారికి ఎదురెళ్లుతుందా ?   అంత సాహసం చేస్తుందా ? అన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో ఉంది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YV Subbareddy SIT questions: హైదరాబాద్‌లో వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్న సుప్రీంకోర్టు సిట్ - కల్తీ నెయ్యి స్కాంలో కీలక చర్యల దిశగా అడుగులు
హైదరాబాద్‌లో వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్న సుప్రీంకోర్టు సిట్ - కల్తీ నెయ్యి స్కాంలో కీలక చర్యల దిశగా అడుగులు
Supreme Court: బిల్లుల ఆమోదంలో గవర్నర్‌, రాష్ట్రపతికి గడువు పెట్టలేం, ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్య
బిల్లుల ఆమోదంలో గవర్నర్‌, రాష్ట్రపతికి గడువు పెట్టలేం, ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్య
Nepal Gen Z: నేపాల్‌లో మళ్లీ అంటుకున్న జెడ్Z ఆవేశం - పలు చోట్ల కర్ఫ్యూ
నేపాల్‌లో మళ్లీ అంటుకున్న జెడ్Z ఆవేశం - పలు చోట్ల కర్ఫ్యూ
Eatala Rajender Vs Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక మంటలు- ఈటల,బండి మధ్య మాటల యుద్ధం 
తెలంగాణ బీజేపీలో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక మంటలు- ఈటల,బండి మధ్య మాటల యుద్ధం 
Advertisement

వీడియోలు

అతను పేపర్ కెప్టెన్ అంతే..  ధోనీ, రుతురాజ్‌పై కైఫ్ షాకింగ్ కామెంట్స్
బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన గిల్.. మరి పనిష్మెంట్ లేదా?
Suma about Her Retirement in Premiste Event | రిటైర్మెంట్ పై సుమ కామెంట్స్ | ABP Desam
BJP Madhavi Latha on SS Rajamouli : రాజమౌళి హనుమాన్ కామెంట్స్ పై మాధవీలత రియాక్షన్ | ABP Desam
WTC Final India | టీమిండియా టెస్ట్ చాంపియన్‌ షిప్ ఫైనల్ చేరాలంటే ఇదొక్కటే దారి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YV Subbareddy SIT questions: హైదరాబాద్‌లో వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్న సుప్రీంకోర్టు సిట్ - కల్తీ నెయ్యి స్కాంలో కీలక చర్యల దిశగా అడుగులు
హైదరాబాద్‌లో వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్న సుప్రీంకోర్టు సిట్ - కల్తీ నెయ్యి స్కాంలో కీలక చర్యల దిశగా అడుగులు
Supreme Court: బిల్లుల ఆమోదంలో గవర్నర్‌, రాష్ట్రపతికి గడువు పెట్టలేం, ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్య
బిల్లుల ఆమోదంలో గవర్నర్‌, రాష్ట్రపతికి గడువు పెట్టలేం, ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్య
Nepal Gen Z: నేపాల్‌లో మళ్లీ అంటుకున్న జెడ్Z ఆవేశం - పలు చోట్ల కర్ఫ్యూ
నేపాల్‌లో మళ్లీ అంటుకున్న జెడ్Z ఆవేశం - పలు చోట్ల కర్ఫ్యూ
Eatala Rajender Vs Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక మంటలు- ఈటల,బండి మధ్య మాటల యుద్ధం 
తెలంగాణ బీజేపీలో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక మంటలు- ఈటల,బండి మధ్య మాటల యుద్ధం 
iBOMMA One Website : iBOMMA పోయింది... iBOMMA One వచ్చింది - ఒక్కసారి క్లిక్ చేస్తే...
iBOMMA పోయింది... iBOMMA One వచ్చింది - ఒక్కసారి క్లిక్ చేస్తే...
Temple Fire: భక్తితో వెలిగించిన దీపం ఆలయాన్ని బుగ్గి చేసింది - జాగ్రత్త లేని భక్తి - వీడియో వైరల్
భక్తితో వెలిగించిన దీపం ఆలయాన్ని బుగ్గి చేసింది - జాగ్రత్త లేని భక్తి - వీడియో వైరల్
Sonam Kapoor : మరోసారి తల్లి కాబోతోన్న స్టార్ హీరోయిన్ - పింక్ డ్రెస్‌లో బేబీ బంప్‌తో...
మరోసారి తల్లి కాబోతోన్న స్టార్ హీరోయిన్ - పింక్ డ్రెస్‌లో బేబీ బంప్‌తో...
Sundar Pichai:  ఏదో ఒక రోజు సీఈవో పోస్టు కూడ ఏఐ కొట్టేస్తుంది - ఆందోళన చెందుతున్న సుందర్ పిచాయ్
ఏదో ఒక రోజు సీఈవో పోస్టు కూడ ఏఐ కొట్టేస్తుంది - ఆందోళన చెందుతున్న సుందర్ పిచాయ్
Embed widget