అన్వేషించండి

Konda Vishweshwar Reddy : అవును బీజేపీలో చేరుతున్నాను- సస్పెన్ష్‌కు తెర దించిన కొండా విశ్వేశ్వరరెడ్డి

బీజేపీలో చేరుతున్నట్టు కాంగ్రెస్ మాజీ నేత కొండా విశ్వేశ్వరెడ్డి ప్రకటించారు. కేసీఆర్‌ను ఓడించాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని సర్వేల్లో తేలిందని తెలిపారు.

బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని ప్రకటించారు కొండా విశ్వేశ్వరరెడ్డి . రెండేళ్ల నుంచి పార్టీపై చేరికలు నడుస్తున్నాయన్నారు. కేంద్రనాయకత్వం స్థాయిలో ఈ చర్చలు నడుస్తున్నాయని తెలిపారు. చాలా మంది తెలంగాణ ఉద్యమకారులతో కూడా మాట్లాడినట్టు తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలన తొలగించి.. ప్రజాపాలన బీజేపీతోనే సాధ్యమని నమ్ముతున్నట్టు వెల్లడించారు. 

కాంగ్రెస్‌తో మంచి సంబంధాలే ఉన్నప్పటికీ ఆ పార్టీకి కేసీఆర్‌ను ఓడించే శక్తి లేదని అభిప్రాయపడ్డారు కొండా విశ్వేశ్వరరెడ్డి. తెలంగాణలో తప్ప దేశంలో కాంగ్రెస్ ఎక్కడ బలంగా లేదన్నారు. ఇక్కడ నాయకత్వంతోనే అది సాధ్యమవుతుంది గానీ కాంగ్రెస్‌ బలం కాదన్నారు. ఈ పరిస్థితిలో కేసీఆర్‌ను ఓడించే దమ్ము బీజేపీకి మాత్రమే ఉందన్నారు.

మోదీ పట్ల దేశంపై నమ్మకం పెట్టుకుందని... తెలంగాణలో కూాడా ఆయనపై అపారమైన నమ్మకం ఉందన్నారు. అందుకే ఇక్కడ కూడా బీజేపీ వస్తే మంచి భవిష్యత్ ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. 

టీఆర్‌ఎస్‌ హయాంలో రంగారెడ్డి జిల్లాకు చాలా అన్యాయమైపోయిందన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇక్కడ నిధులన్నీ తీసుకొని వాళ్ల సొంత ఊరిలో పెట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌పై కోపంతో తాను పార్టీ మారడం లేదని లేదని... ఉద్యమకారులను మోసం చేసినందుకు తట్టుకోలేకపోయనంటున్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లందర్నీ పక్కకు పెట్టేసి డబ్బుతోనే రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు.  ఇప్పుడు ఉన్న వాళ్లంతా ఉద్యమంలో లేని వారేనన్నారు.

ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు కేడర్‌కు సంబంధం తెగిపోయిందని అభిప్రాయపడ్డారు కొండా విశ్వేశ్వరరెడ్డి. కాంగ్రెస్‌కు కేడర్‌కు ఆ అటాచ్‌మెంట్‌ ఉందన్నారు. బీజేపీకి కూడా ఆ బాండింగ్ ఉందని తెలిపారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు డబ్బుతో తప్ప వేరే అటాచ్మెంట్‌ లేదని విమర్శించారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ బాగా ఖర్చు పెట్టింది కానీ అక్కడ తెలంగాణవాదం గెలిచిందని కామెంట్ చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి. రాబోయే ఎలక్షన్‌లో కూడా టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీ గెలుచుకుంటుంది. 

క్వాలిటేటివ్‌ సర్వేలో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని అభిప్రాయపడ్డారు కొండా విశ్వేశ్వరరెడ్డి. రేవంత్‌తో తనకు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ చచ్చిపోతున్న టైంలో రేవంత్‌ను పీసీసీ చీఫ్‌గా చేశారని తెలిపారు. ముందుగా చేసి ఉంటే తెలంగాణలో పరిస్థితి వేరుగా ఉండేది అన్నారు. 

ఎప్పుడు... ఎలా చేర్చాలనేది... ఎవరి ఆధ్వర్యంలో అనేది బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డికే వదిలేశాను. మొదట 1న చేరొచ్చన్నారని... తర్వాత మళ్లీ ప్లాన్ మారిందన్నారు. 2, 3 తేదీల్లో చేరే ఛాన్స్ ఉందని తెలిపారు. సంప్రదాయం ప్రకారం పార్టీ ప్రెసిడెంట్‌ ఆధ్వర్యంలో జాయినింగ్స్ ఉంటాయి. పార్టీలో చేరినప్పుడు నాకేంటని ఎప్పుడూ అడగలేదన్నారు కేవీఆర్. ఇప్పుడు కూడా అడగలేదని వివరించారు. ఇక్కడ బీజేపీలో చేరడానికి ముందు ఐదు విషయాలపై క్లారిటీ కోరానన్నారు.

కొండా విశ్వేశ్వరరెడ్డి అడిగిన ఐదు పాయింట్లు

తెలంగాణలో జరిగిన దోపిడీపై ఏం చేయబోతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారని క్లారిటీ అడిగానన్నారు. 

ఈటల రాజీనామాతో వచ్చిన బై ఎలక్షన్‌లో ఓటమితో  టీఆర్‌ఎస్ సగమ చచ్చిపోయిందన్నారు. ఇంకో బై ఎలక్షన్‌ వస్తే పూర్తిగా చచ్చిపోద్దన్నారు. ఇప్పుడు కేసులను పరిష్కరిస్తే మరో ఉపఎన్నిక వచ్చే ఛాన్స్‌ ఉందన్నారు.  

మైనారిటీకి వ్యతిరేకమా... అని అడిగాను. ఉదయ్‌పూర్ లాంటి వాళ్లకే వ్యతిరేకం కానీ.... ముస్లింలకు వ్యతిరేకం కాదని నడ్డా వివరణ ఇచ్చారన్నారు.   

బీజేపీ అగ్రకులాల పార్టీ అనే అపోహ ఉందని... దానిపై క్లారిటీ అడిగానన్నారు. ఇప్పుడు బీజేపీ కులం లేని హిందుత్వ పార్టీ అని అభిప్రాయపడ్డారు.   

మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ జోరు పెరగాలని... దీనికి ఓ ప్లాన్‌ కూడా బీజేపీకి చెప్పానన్నారు.  

కాంగ్రెస్‌ను తప్పుబడితే నాకు ఓట్లు రావని... కేసీఆర్‌ను నిలదీస్తేనే ఓట్లు వస్తాయన్నారు కొండా విశ్వేశ్వరరావు. గ్రామీణ ప్రాంతాల్లో దోపిడీ ఏంటో కనిపిస్తోందని... హైదరాబాద్‌లో కనిపించకపోవచ్చన్నారు. 

కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెలంగాణకు వస్తుంది. సంబంధాలు మంచిగా ఉంటే రావాల్సినవి త్వరగా వస్తాయన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. జగన్, విజయసాయిరెడ్డి ఎలా మాట్లాడుతున్నరో చూడాలన్నారు. స్టాలిన్ చూసి నేర్చుకోవాలని సూచించారు. అందుకే వాళ్లకు త్వరగా నిధులు వస్తున్నాయని తెలిపారు. తీసుకున్న అప్పులను కూడా తెలంగాణ ప్రభుత్వం దాచిపెట్టింది. దానికి గ్యారెంటీలు కేంద్రం ఇచ్చింది. ఇప్పుడే గుర్తించారు. ఎటాక్ ఇంకా ఉంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Parents Property Rights: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
Justin Trudeau: అమెరికాలో కెనడా విలీనమా? అంత సీన్ లేదు, డొనాల్డ్ ట్రంప్‌నకు ఇచ్చి పడేసిన ట్రూడో
అమెరికాలో కెనడా విలీనమా? అంత సీన్ లేదు, డొనాల్డ్ ట్రంప్‌నకు ఇచ్చి పడేసిన ట్రూడో
PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
Renu Desai: రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parents Property Rights: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
Justin Trudeau: అమెరికాలో కెనడా విలీనమా? అంత సీన్ లేదు, డొనాల్డ్ ట్రంప్‌నకు ఇచ్చి పడేసిన ట్రూడో
అమెరికాలో కెనడా విలీనమా? అంత సీన్ లేదు, డొనాల్డ్ ట్రంప్‌నకు ఇచ్చి పడేసిన ట్రూడో
PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
Renu Desai: రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
KTR Formula E Car Race: హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
Daaku Maharaaj: బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
AP Gokulam Scheme: సంక్రాంతికి ఏపీ వ్యాప్తంగా గోకులాలు ప్రారంభం, పిఠాపురంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
సంక్రాంతికి ఏపీ వ్యాప్తంగా గోకులాలు ప్రారంభం, పిఠాపురంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
ICC Test Rankings News: భారత్ కు షాకిచ్చిన ఐసీసీ ర్యాంకింగ్స్- 2016 తర్వాత తొలిసారి ఆ ర్యాంకుకు చేరిక
భారత్ కు షాకిచ్చిన ఐసీసీ ర్యాంకింగ్స్- 2016 తర్వాత తొలిసారి ఆ ర్యాంకుకు చేరిక
Embed widget