Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్ - సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు దంచి కొట్టనున్న వర్షం - రెడీ !
Hyderabad : సోమవారం హైదరాబాద్ వాసులను భారీ వర్షం మరోసారి పలకరించనుంచి. నాలుగున్నర దాటిన తర్వాత ఎనిమిదిన్నర వరకూ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

Hyderabad Rains Warning : హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. పనుల మీద బయటకు వెళ్లిన వారు సాయంత్రం నాలుగున్నరలోపు ఇంటికి చేరుకుంటే.. వర్షం..దాని వల్ల కలిగే ట్రాఫిక్ జాముల నుంచి బయటపడవట్టు. సోమవారం సాయంత్రం నాలుగున్నర దాటిన తర్వాత ఎనిమిదిన్నర వరకూ సిటీ అంతటా భారీ వర్షాలు పడతాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయి. గత మూడు రోజులుగా సిటీలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. ఆదివారం ఒక్క హైదరాబాద్ వెస్ట్ లో తప్ప.. మిగిలిన మూడు జోన్లలో జోరుగా వర్షాలు పడ్డాయి. సోమవారం వెస్ట్ లో కూడా భారీ వర్షాలు ఉంటాయి. ట్రాఫిక్ కారిడార్ గా పేరున్న ఐటీ కారిడార్ కూడా వెస్ట్ పరిధిలోకే వస్తుంది.
HyderabadRains WARNING ⚠️⛈️
— Telangana Weatherman (@balaji25_t) July 21, 2025
Dear people of Hyderabad, get ready for MASSIVE STORMS IN entire city during 4.40-7.40PM. It will be accompanied with INTENSE THUNDERS and HEAVY RAINFALL. Please plan accordingly ⚠️⛈️⚠️
ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దానికి సంబంధించన మ్యాపులను కూడా పోస్టు చేస్తున్నారు.
#21JULY 2:50PM⚠️
— Hyderabad Rains (@Hyderabadrains) July 21, 2025
MASSIVE RAINS firing up Every Where in Telangana ⛈️💥⚠️#Hyderabad will be Dry next 1-2Hrs.& Our Rains Show will Start Soon. pic.twitter.com/cFtNlPZ1xC
రుతుపవనాలు ముందే వచ్చినప్పటికీ.. జూలై మధ్య నాటికి హైదరాబాద్‌లలో వర్షపాతం సాధారణంలో సగం మాత్రమే నమోదు అయింది. అయితే గత రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జులై నెలలో సగటున 174-243 మి.మీ. వర్షపాతం నమోదవుతుందని సుమారు 11-15 రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరమమ నిపుణులుచెబుతున్నారు. హైదరాబాద్‌తో సహా తెలంగాణాలోని 33 జిల్లాల్లో జులై 17 నుండి 22 వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఇంతకు ముందే ప్రకటించారు. ఆ ప్రకాంర వర్షాలు పడుతున్నాయి. మూడు రోజులకిందట హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి 93.0 మి.మీ వర్షం పడింది.
HEAVY STORMS ALERT 21/07 ⚠️⛈️
— Hyderabad Rainfall Alerts (@Hydrainwarnings) July 21, 2025
As already said due to LPA confluence TG will have strong storms, here is the detailed mapping provided for today's rainfall alert
🟪 - Evening - Night rains ahead
🟥 - AFT - Morning SCT
🟦 - After 2PM - morning
🟨 - Evening - night #HyderabadRains pic.twitter.com/NYu8DF09lr





















