Weather Hyderabad: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు- హైదరాబాద్‌లో వర్షాలు
Weather Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మార్పులు కారణంగా హైదరాబాద్‌లో వానలు కురిసే అవకాశం ఉంది.

Weather Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో శనివారం నుంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తోపాటు దాదాపు అన్ని జిల్లాల్లో ఐదు రోజుల పాటు జోరు వానలు కురిసే ఛాన్స్ ఉందని వివరించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాతావరణ పరిస్థితులు మారుతున్నట్టు అధికారులు చెప్పారు.
భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం శనివారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. పలు చోట్ల ఉరుమురు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెబుతోంది. ఐదు రోజుల పాటు వానలు పడతాయని పేర్కొంది. వర్షాలతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
IMD ప్రకారం కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. జూన్ 28 నుంచి జులై 1 వరకు వాతావరణం చల్లబడుతుందని పేర్కొన్నారు. బలమైన ఉపరితల గాలులు ఆంధ్రప్రదేశ్ రాయలసీమను ప్రభావితం చేస్తాయి.
అదనంగా, ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి ఒడిశా వరకు విస్తరించి ఉన్న ద్రోణి, సగటు సముద్ర మట్టానికి 4.5, 5.8 కి.మీ ఎత్తున విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్. యానాం మీదుగా దిగువ ఉష్ణమండల నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఇవి తేమ గాలుల ప్రవాహాన్ని పెంచుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
వీటి ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు పడబోతున్నాయి. వీటి ప్రభావం తెలంగాణలో తక్కువగా ఉంటుందని ఏపీపై ఎక్కువగా అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి.





















