By: ABP Desam | Updated at : 07 Jun 2022 08:31 AM (IST)
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, సీఎం కేసీఆర్
జూబ్లిహిల్స్ పబ్‌కు వెళ్లిన మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన మరవకముందే నెక్లెస్ రోడ్డులో మరో మైనర్ బాలికపై అత్యాచారం జరగడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అందుకు సీఎం కేసీఆర్ చేతకాని పాలనే కారణమని బీజేపీ శాసనసభాపక్షనేత రాజాసింగ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు, డ్రగ్స్ దందాకు హైదరాబాద్ అడ్డాగా మారిందన్నారు.
హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు, డ్రగ్స్ దందాకు అడ్డాగా రాష్ట్రం..
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని... హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు, డ్రగ్స్ దందాకు అడ్డాగా మారింది. టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ఆగడాలు మితిమీరిపోయాయి.. కేసీఆర్ పాలనలో తామేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో బలుపెక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్ అత్యాచారాల అడ్డాగా మారింది. జూబ్లిహిల్స్ లో మైనర్ బాలికపై టీఆర్ఎస్, మజ్లిస్ నాయకుల కుమారుల గ్యాంగ్ రేప్, దాష్టీకాలను మరువకముందే నెక్లెస్ రోడ్డులో మరో మైనర్ బాలికపై అత్యాచారం తాజాగా వెలుగు చూడటం అత్యంత బాధాకరం. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్టుగూడలో మూర్చ వ్యాధిగ్రస్తుడైన అమాయకుడిపై పోలీసులు మూకుమ్మడిగా దాడి చేయడం దారుణమన్నారు.
అమాయకులు, పేదలపై పోలీసుల ప్రతాపం..
‘కేసీఆర్ పాలనలో చట్టాలంటే క్రిమినల్స్‌కు భయం లేకుండా పోయింది. మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయింది. అమాయకులపైనా, పేదలపైన ప్రతాపం చూపుతున్న పోలీసులు రాజకీయ పలుకుబడి, డబ్బున్న వాళ్లను మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తూ శాంతిభద్రతల సమస్యకు కారకులవడం సిగ్గు చేటు. టీఆర్ఎస్, మజ్లిస్ నేతల అండ చూసుకుని పెట్రేగిపోతున్నారు. తామేం చేసినా చెల్లుతుందనే భావనతో అభం శుభం తెలియని బాలికలు, మహిళపై అత్యాచారాలకు, హత్యలకు ఒడిగడితున్నారని’ బీజేపీ నేతలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పాలనలో మహిళలు, బాలికలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. టీఆర్ఎస్ నాయకులనో, మజ్లిస్ పార్టీ వాళ్లనో చూసీ చూడనట్లు వదిలేయడంవల్లే రాష్ట్రంలో ఈ దుస్థితి ఏర్పడింది. ఇకనైనా కేసీఆర్ ప్రభుత్వం బుద్ది తెచ్చుకుని క్రిమినల్స్ ను క్రిమినల్స్ గా చూసి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో కేసీఆర్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
Telangana: 13 బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాలకు మంత్రుల శంకుస్థాపన, దసరా నాటికి నిర్మాణం పూర్తి
BRS Party : పొంగులేటితో భేటీ, 20 మంది బీఆర్ఎస్ నాయకులపై అధిష్ఠానం వేటు
MP Uttam Kumar Reddy : ఈ నెలలో తెలంగాణ అసెంబ్లీ రద్దు, రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు- ఉత్తమ్ కుమార్ రెడ్డి
Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్
Hyderabad News: స్కూల్ అసిస్టెంట్లను మాత్రమే ట్రాన్స్ ఫర్ చేశారు, మేమేం పాపం చేశామంటూ మిగతా టీచర్ల ఆవేదన
Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్
Jr NTR: అప్డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!
AP SI Hall Tickets: ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?
Vijay Devarakonda: బ్లాక్‌బస్టర్ ‘గీత గోవిందం’ కాంబో రిపీట్ - కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ, పరశురామ్!