Telangana MLAs defection case: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితి - దానం, కడియం స్థానాలకు ఉపఎన్నికలు తప్పవా ?
By elections: దానం , కడియం నియోజకవర్గాలకు ఉపఎన్నికలు తప్పకుండా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. స్పీకర్ తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది.

Telangana MLAs defections Speaker Rule: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హతా పిటిషన్లపై విచారణ ముగిసే దశలో ఉంది. సుప్రీం కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేయడంతో విచారణ వేగం పెంచారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేల క్రాస్-ఎగ్జామినేషన్ పూర్తి అయింది. దానం నాగేందర్, కడియం శ్రీహరిలుక తాజాగా నోటీసులు జారీ చేశారు. వీరిద్దరి విషయం పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. ఈ ఇద్దరూ పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. పార్టీ మారలేదని పిటిషన్లు తిరస్కరించడానికి అవకాశం లేకుండా పోయింది.
పార్టీ మారలేదంటున్న ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేపై 'అంటీ-డిఫెక్షన్ లా' కింద అనర్హతా పిటిషన్లు దాఖలు చేసింది. 10వ షెడ్యూల్ ప్రకారం, పార్టీ విప్ ధిక్కరించి మరో పార్టీలోకి చేరితే అనర్హతా వేటు వేయాలి. సుప్రీం కోర్టు జూలై 31, 2025న స్పీకర్‌కు మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోమని ఆదేశించింది. అయితే, స్పీకర్ ఇంకా సమయంకోరారు. బీఆర్ఎస్ మళ్లీ సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్ వేసింది. నవంబర్ 17న కోర్టు 'కాంటెంప్ట్' నోటీసు జారీ చేసి, "రాజకీయ పక్షపాతం లేకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలి" అని హెచ్చరించింది. దీంతో స్పీకర్ వేగాన్ని పెంచుకుని, విచారణ పూర్తి చేస్తున్నారు. డిసెంబర్ 20లోపు నిర్ణయం ప్రకటించనున్నారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని వాంగ్మూలం ఇచ్చారు.
స్పీకర్ నిర్ణయం ఖాయం
ఎనిమిది మంది ఎమ్మెల్యేలు క్రాస్-ఎగ్జామినేషన్‌లో "మేము బీఆర్ఎస్‌లోనే ఉన్నాం" అని చెప్పారు. వారు అఫిడవిట్‌లు సమర్పించి, "పార్టీ మార లేదు, ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం అంతే" అని వాదించారు. బీఆర్ఎస్ వద్ద విప్ ధిక్కరణకు సంబంధించిన గట్టి ఆధారాలు లేకపోవడం వల్ల, ఈ ఎనిమిది మందిపై అనర్హతా వేటు వేయకపోవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. "అంటీ-డిఫెక్షన్ లా ప్రకారం, పార్టీ మారినట్లు ప్రూఫ్ లేకుండా అనర్హతా వేయలేరు" అని నిపుణులు చెబుతున్నారు. స్పీకర్ బీఆర్ఎస్ పిటిషన్లను తిరస్కరించవచ్చు. వారు కోర్టుకు వెళ్తారా లేదా అన్నది తర్వాత విషయం. కానీస్పీకర్ అయితే నిర్మయం తీసుకుంటారు.
కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో అస్పష్టత
కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో బీఆర్ఎస్ వద్ద గట్టి ఆధారాలు ఉన్నాయి. శ్రీహరి కుమార్తె కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా గెలిచారు. ఆయన తాను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పుకునేందుకు అంగీకరించడం లేదు. నాగేందర్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో సీకెంద్రాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ విషయాన్ని కాదనలేరరు. ఇద్దరూ నోటీసులకు స్పందించకుండా అదనపు సమయం అడిగారు. ఇప్పుడు అఫిడవిట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఇద్దరిపై నిర్ణయం తీసుకోవాలంటే అనర్హతా వేటు వేయాల్సిందే.
తప్పనిసరి అయితే రాజీనామాలు - ఉపఎన్నికలు
అనర్హతా వేటు వేయాల్సిన పరిస్థితి వస్తే ఆ ఇద్దరితో రాజీనామాలు చేయించి ఉపఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాలుచెబుతున్నాయి. అనర్హాత వేటు కంటే.. రాజీనామా ద్వారా ఉపఎన్నికలకు వెళ్లడం కీలకం. అయితే పార్టీ మార్పు ద్వారా వచ్చిన ఉపఎన్నికల విషయంలో ప్రజలు వ్యతిరేకంగా స్పందించడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే సీఎం రేవంత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపఎన్నికలు రావు అంటున్నారు. ఇలాంటి విషయాల్లో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. అందుకే ఈ వివాదం.. సుప్రీంకోర్టులో కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.





















