Xiaomi 11T Pro Launched: 17 నిమిషాల్లోనే పూర్తి చార్జింగ్.. షియోమీ అదిరిపోయే కొత్త ఫోన్.. ప్రారంభ సేల్‌లో రూ.10 వేలు ఆఫర్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మనదేశంలో తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే షియోమీ 11టీ ప్రో 5జీ.

FOLLOW US: 

షియోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 120W ఫాస్ట్ చార్జింగ్‌ను అందించారు. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో హర్మన్ కర్డాన్ స్టీరియో స్పీకర్లను అందించారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు, 5జీ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. రియల్‌మీ జీటీ, వన్‌ప్లస్ 9ఆర్‌టీ, ఐకూ 7 లెజెండ్, వివో వీ23 ప్రోలతో ఈ ఫోన్ పోటీ పడనుంది.

షియోమీ 11టీ ప్రో 5జీ ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.43,999గా ఉంది. సెలెస్టియల్ మ్యాజిక్, మెటియోరైట్ గ్రే, మూన్‌లైట్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఎంఐ.కాం, ఇతర ఆఫ్‌లైన్ రిటైలర్ల దగ్గర ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. సిటీ బ్యాంకు కార్డులు, ఈఎంఐ ఆప్షన్ల ద్వారా కొనుగోలు చేస్తే రూ.5,000 తగ్గింపు లభించనుంది. ఎక్స్‌చేంజ్ ద్వారా అదనంగా మరో రూ.5,000 వరకు తగ్గింపు 

షియోమీ 11టీ ప్రో 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లాట్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. 120 హెర్ట్జ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ ఇందులో అందించారు. టచ్ శాంప్లింగ్ రేట్ 480 హెర్ట్జ్‌గా ఉంది.

12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్ ఇందులో ఉంది. 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. వర్చువల్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ద్వారా ర్యామ్‌ను 3 జీబీ వరకు పెంచుకోవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో షూటర్‌లను ఇందులో అందించారు.

ప్రో టైమ్ ల్యాప్స్, సినిమాటిక్ ఫిల్టర్స్, ఆడియో జూమ్ వంటి 50 డైరెక్టర్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. 8కే వీడియో రికార్డింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, నావిక్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, గైరోస్కోప్, మ్యాగ్నెటిక్ కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 120W హైపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 0 నుంచి 100 శాతం చార్జింగ్ కేవలం 17 నిమిషాల్లోనే ఎక్కనుంది. ఫోన్‌తో పాటు 120W వైర్డ్ చార్జర్‌ను అందించనున్నారు. దీని మందం 0.88 సెంటీమీటర్లు కాగా, బరువు 204 గ్రాములుగా ఉంది.

Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!

Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!

Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!

Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Xiaomi New Phone Xiaomi Xiaomi 11T Pro 5G Xiaomi 11T Pro 5G Specifications Xiaomi 11T Pro 5G Features Xiaomi 11T Pro 5G Launched Xiaomi 11T Pro 5G Price in India

సంబంధిత కథనాలు

Google Pixel 6A Price: గూగుల్ పిక్సెల్ ధరలను ప్రకటించిన కంపెనీ - ఏ దేశంలో తక్కువకు కొనచ్చంటే?

Google Pixel 6A Price: గూగుల్ పిక్సెల్ ధరలను ప్రకటించిన కంపెనీ - ఏ దేశంలో తక్కువకు కొనచ్చంటే?

Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Samsung Galaxy S22: సూపర్ లుక్‌లో శాంసంగ్ ఎస్22 ఫోన్ - కొత్త కలర్‌లో లాంచ్ చేసిన కంపెనీ!

Samsung Galaxy S22: సూపర్ లుక్‌లో శాంసంగ్ ఎస్22 ఫోన్ - కొత్త కలర్‌లో లాంచ్ చేసిన కంపెనీ!

Tecno Pova 3: 50 మెగాపిక్సెల్ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ - ధర రూ.14 వేలలోపే!

Tecno Pova 3: 50 మెగాపిక్సెల్ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ - ధర రూ.14 వేలలోపే!

Samsung Galaxy F23 5G Copper Blush: రూ.15 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Samsung Galaxy F23 5G Copper Blush: రూ.15 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

టాప్ స్టోరీస్

KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్‌కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ

KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్‌కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ

Prabhas: ప్రభాస్‌కు కండిషన్లు పెట్టిన దర్శకుడు?

Prabhas: ప్రభాస్‌కు కండిషన్లు పెట్టిన దర్శకుడు?

Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam

Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam

Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'

Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'