Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!

టెక్నో మనదేశంలో మొట్టమొదటి 5జీ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. అదే టెక్నో పోవా 5జీ.

FOLLOW US: 

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన మొట్టమొదటి 5జీ స్మార్ట్ ఫోన్‌ను నైజీరియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అదే టెక్నో పోవా 5జీ. ఈ ఫోన్ మనదేశంలో జనవరిలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కంపెనీ ఇండియా సీఈవో అర్జీత్ తలపాత్రా తెలిపారు.

దీంతోపాటు ఈ ఫోన్ ధరపై కూడా క్లారిటీ ఇచ్చారు. దీని ప్రకారం ఈ ఫోన్ ధర రూ.18 వేల నుంచి రూ.20 వేల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ నైజీరియాలో 1,29,000 నైరాల(సుమారు రూ.23,500) ధరతో లాంచ్ అయింది.

టెక్నో పోవా 5జీతో పాటు కొత్త టీడబ్ల్యూఎస్, స్పీకర్లు, స్మార్ట్ వాచ్ కూడా టెక్నో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ స్పీకర్లు జనవరిలోనే లాంచ్ కానున్నాయి. కానీ స్మార్ట్ వాచ్ మాత్రం ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో (ఏప్రిల్, జూన్ మధ్య) లాంచ్ కానుంది. దీని ధర రూ.5,000 లోపే ఉండే అవకాశం ఉంది.

టెక్నో పోవా 5జీ స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ నైజీరియాలో ఇప్పటికే లాంచ్ అయింది. కాబట్టి స్పెసిఫికేషన్లు ముందే చూడవచ్చు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 8.0 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో పోవా 5జీ పనిచేయనుంది. ఈ ఫొన్‌లో 6.95 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 82.8 శాతంగానూ ఉంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080 x 2460 పిక్సెల్స్‌గా ఉంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై టెక్నో పోవా 5జీ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

సెక్యూరిటీ కోసం ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. డ్యూయల్ సిమ్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్, ఏ-జీపీఎస్, బైదు, గ్లోనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 03 Jan 2022 05:47 PM (IST) Tags: Tecno Tecno Pova 5G Tecno Pova 5G Specifications Tecno Pova 5G Features Tecno Pova 5G India Launch Tecno Pova 5G Price in India Tecno First 5G Phone Cheapest 5G Phones

సంబంధిత కథనాలు

Oppo A57 2022: రూ.13 వేలలోపే ఒప్పో కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?

Oppo A57 2022: రూ.13 వేలలోపే ఒప్పో కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?

Boat Wave Neo: రూ.1,800లోపే అదిరిపోయే స్మార్ట్ వాచ్ - లాంచ్ చేసిన భారతీయ బ్రాండ్!

Boat Wave Neo: రూ.1,800లోపే అదిరిపోయే స్మార్ట్ వాచ్ - లాంచ్ చేసిన భారతీయ బ్రాండ్!

Realme C30: రూ.10 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్ - లాంచ్ వచ్చే నెలలోనే?

Realme C30: రూ.10 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్ - లాంచ్ వచ్చే నెలలోనే?

Moto E32s: మోటొరోలా కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది - ధర రూ.13 వేలలోపే!

Moto E32s: మోటొరోలా కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది - ధర రూ.13 వేలలోపే!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్ 

Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్