![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో లాంచ్ చేయబోయే వై01 ధర, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
![Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే! Vivo Y01 Price and Specifications Leaked Online Know Details Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/2526e280cd4473da432812ef24265512_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వివో కొత్త స్మార్ట్ ఫోన్ వై01 ధర, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రముఖ టిప్‌స్టర్ సుధాంశు అంభోర్ ఈ వివరాలు లీక్ చేశారు. ఈ ఫోన్ మొదట యూరోప్‌లో లాంచ్ కానుందని సమాచారం.
వివో వై01 ధర (లీక్)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో రానున్న దీని ధర 100 యూరోల (సుమారు రూ.8,420) రేంజ్‌లో ఉండనుందని తెలుస్తోంది. బ్లాక్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
వివో వై01 స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇందులో 6.51 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720 x 1600 పిక్సెల్స్‌గా ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 89 శాతంగా ఉండనుంది. ఇందులో వెనకవైపు చదరపు ఆకారంలో రెండు కెమెరాలు అందించనున్నారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉండనుంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు. ఆండ్రాయిడ్ 11 గోఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండబోవడం లేదు. అయితే ఫేస్ అన్‌లాక్‌ను మాత్రం అందించనున్నారు. వైఫై, బ్లూటూత్ వీ5.0, యూఎస్‌బీ 2.0, డ్యూయల్ సిమ్ కార్డు సపోర్ట్ ఇందులో ఉండనున్నాయి. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా.. బరువు 178 గ్రాములుగా ఉంది.
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)