Realme P1 5G Sale: రియల్‌మీ బడ్జెట్ 5జీ ఫోన్ సేల్ షురూ - రూ.15 వేలలోపే!
Realme P1 5G: రియల్‌మీ తన పీ1 5జీ సిరీస్ ఫోన్లను ఇటీవలే మనదేశంలో లాంచ్ చేసింది. వీటిలో రియల్‌మీ పీ1 5జీ, రియల్‌మీ పీ1 ప్రో 5జీ మొబైల్స్ ఉన్నాయి. రియల్‌మీ పీ1 5జీ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అయింది.
Realme P1 5G Flipkart Sale: రియల్‌మీ పీ1 5జీ (Realme P1 5G) స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. రియల్‌మీ పీ1 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌పై రన్ కానుంది. 45W సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని రియల్‌మీ పీ1 5జీలో అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై బేస్ అయిన రియల్‌మీ యూఐ 5.0 పని చేస్తుంది.
రియల్‌మీ పీ1 5జీ ధర ఎంత? (Realme P1 5G Price in India)
రియల్‌మీ పీ1 5జీ రెండు వేరియంట్లలో మనదేశంలో అందుబాటులోకి వచ్చింది. ప్రారంభ వేరియంట్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. హై ఎండ్ వేరియంట్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. పీకాక్ గ్రీన్, ఫీనిక్స్ రెడ్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు
The power sale is now live! 🔥
— realme (@realmeIndia) April 22, 2024
Get your hands on the power with the offers of #realmeP1 5G.
Head here: https://t.co/OvtU8aQHa9#realmePseries5G pic.twitter.com/OeGjj1zW8v
రియల్‌మీ పీ1 5జీ స్పెసిఫికేషన్లు (Realme P1 5G Specifications)
రియల్‌మీ పీ1 5జీలో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేని కంపెనీ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. రెయిన్ వాటర్ టచ్ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో అందించారు. అంటే తడి చేతులతో కూడా ఫోన్‌ను ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉపయోగించవచ్చన్న మాట. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌పై రియల్‌మీ పీ1 పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. ఈ రెండిట్లో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ పీ1 5జీ రన్ కానుంది. రెండు జనరేషన్ల ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లు అందించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించాడు. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఐపీ54 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు.
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది