గూగుల్ క్రోమ్ తరహాలో ఉండే ఫేక్ యాప్ ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ యాప్‌లో మాల్‌వేర్ కూడా ఉంటుంది కాబట్టి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. గూగుల్ క్రోమ్ లాంటి యాప్‌లో నుంచి మాల్‌వేర్ మీ ఫోన్‌లో ఎంటర్ అవుతుంది. మీ ఫోన్‌లోకి ఎంటర్ అయ్యాక బ్యాంకు వివరాలను దొంగిలిస్తుంది. మమ్మోంట్ అని పిలిచే ఈ మాల్‌వేర్ చాలా డేంజరస్. కొంతమంది దీన్ని గూగుల్ క్రోమ్ అనుకుని దీన్ని డౌన్‌లోడ్ చేసే అవకాశం ఉంది. మొదట ఇది యూజర్ల నమ్మకాన్ని సాధించి తర్వాత తన పని ప్రారంభిస్తుంది. ఈ యాప్ పేరు కూడా గూగుల్ క్రోమ్ అనే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మాల్‌వేర్ మీ ఫోన్‌లోకి ప్రవేశించాక మాత్రమే పని చేయడం ప్రారంభిస్తుంది. వినియోగదారులను వివిధ మార్గాల్లో ట్రాప్ చేయడానికి ఇది ప్రయత్నిస్తుంది.