ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన బడ్జెట్ 5జీ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేసింది. అవే రియల్‌మీ పీ1 5జీ, రియల్‌మీ పీ1 ప్రో 5జీ. రియల్‌మీ పీ1 5జీ ధర రూ.14,999 నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మీ పీ1 ప్రో 5జీ ధర రూ.19,999 నుంచి మొదలవనుంది. ఈ రెండు ఫోన్లూ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. రియల్‌మీ పీ1 5జీ సేల్ ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మీ పీ1 ప్రో 5జీ సేల్ ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మీ పీ1 5జీ... మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌పై పని చేయనుంది. రియల్‌మీ పీ1 ప్రో 5జీ... క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై పని చేయనుంది. రెండు ఫోన్లలోనూ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి.