ఇకపై గూగుల్‌లో ఏం సెర్చ్ చేసినా డబ్బులు కట్టాల్సి ఉంటుందా? గూగుల్ కంపెనీ ఇప్పటివరకు దాని సర్వీసులను ఉచితంగా ఉంచింది. ఇప్పుడు కంపెనీ ఆ పాలసీని కూడా మార్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రీమియం ఫీచర్లకు పేమెంట్‌ను నిర్ణయించే ఆలోచనలో గూగుల్ ఉన్నట్లు సమాచారం. జనరేటివ్ ఏఐ ఫీచర్ల విషయంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యే జనరేటివ్ ఏఐకి సంబంధించి స్నాప్‌షాట్ ఫీచర్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఫైనాన్షియల్ టైమ్స్ దీనికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసింది. ఈ కథనం ప్రకారం కంపెనీ సెర్చ్ ఇంజిన్‌కు ఛార్జ్ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. దీనికి సంబంధించి గూగుల్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేవలం సెర్చ్ ద్వారానే గూగుల్ 175 బిలియన్ డాలర్లు సంపాదించింది.